Samantha : అక్కినేని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ .. స‌మంత నాగ‌చైత‌న్య మ‌ళ్లీ క‌లుస్తున్నారా.. ? ఇదిగో సాక్ష్యం…?

 Authored By sandeep | The Telugu News | Updated on :21 January 2022,10:02 am

Samantha :ఏ మాయ చేశావే సినిమాతో స‌మంత‌, నాగ చైత‌న్య మ‌ధ్య ప్రేమ చిగురించిన విష‌యం తెలిసిందే. 2017లో ఈ జంట పెళ్లి పేరుతో ఒక్క‌ట‌య్యారు. అయితే కొన్నాళ్ల‌కు ఇద్ద‌రి మధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో అక్టోబ‌ర్ 2న విడాకులు తీసుకున్నారు. విడాకుల ప్రకటనకు నెలల ముందు నుండే సమంత నాగ చైతన్య విడివిడిగా ఉంటున్నారు. మనస్పర్థలు అనంతరం ఒంటరి జీవితం మొదలుపెట్టారు. ఇక వీరి విడాకుల ఎపిసోడ్ లో హైడ్రామా చోటు చేసుకుంది. మీడియాలో పలు నిర్ధార కథనాలు ప్రసారమయ్యాయి. సమంత సదరు కథనాలు ఆపివేయాలని అభ్యర్థించారు. అయినా ఆగకపోవడంతో లీగ‌ల్ యాక్ష‌న్ కూడా చేసింది స‌మంత‌.

స‌మంత రీసెంట్‌గా త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి విడాకుల ప్ర‌క‌ట‌న‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ నోట్‌ను డిలీట్ చేశారు. దీంతో అంద‌రూ అస‌లు స‌మంత అలా ఎందుకు చేసిందంటూ ఆలోచ‌న‌లో ప‌డ్డారు. ఒక‌వేళ ఇద్ద‌రి మ‌ధ్య అండ‌ర్‌స్టాండింగ్ కుదిరి తిరిగి మ‌ళ్లీ క‌లుసుకోబోతున్నారా అనే కొత్త అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇక నాగ‌చైత‌న్య ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం డివోర్స్ స్టేట్‌మెంట్ క‌నిపిస్తుంది. అయితే స‌మంత ఇన్‌స్టాగ్రామ్‌ను క్లీన్ చేసే ప్రాసెస్‌లో విడాకుల ప్ర‌క‌ట‌న నోట్‌ను డిలీట్ చేశార‌ని సినీ వ‌ర్గాలు అంటున్నాయి.

samantha deletes divorce notes from instagram

samantha deletes divorce notes from instagram

Samantha : గుడ్ న్యూస్ చెప్ప‌నుందా?

ఇటీవ‌ల నాగ చైత‌న్య బంగార్రాజు సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా త‌న బెస్ట్ ఆన్‌స్క్రీన్ పెయిర్ స‌మంత అని చెప్పుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఈ ఇద్ద‌రు తిరిగి క‌ల‌వాల‌ని ప్ర‌తి ఒక్క‌రు ప్రార్ధిస్తున్నారు.ఇదిలా ఉంటే రీసెంట‌గా బంగార్రాజు చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన‌న ఈయ‌న థాంక్యూ సినిమాతో పాటు బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్‌తో క‌లిసి లాల్ సింగ్ చ‌ద్దా సినిమాలో న‌టించారు. త్వ‌ర‌లోనే ఓ హార‌ర్ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్‌లోనూ నాగ చైత‌న్య న‌టించ‌బోతున్నారు. స‌మంత కూడా టాలీవుడ్, బాలీవుడ్, హ‌లీవుడ్ చిత్రాల‌తో బిజీగా ఉంది.

Samantha

Samantha

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి