Samantha : నాగ చైత‌న్య‌ కోసం స‌మంత అలాంటి త్యాగం చేసిందా?

Authored By Sam C | The Telugu News | Published on: June 6, 2022, 3:30 pm

Samantha : టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్‌గా ఉన్న నాగ చైత‌న్య‌, స‌మంత నాలుగేళ్ల వైవాహిక జీవితం త‌ర్వాత విడాకులు తీసుకున్న విష‌యం తెలిసిందే. వీరు విడిపోవ‌డం అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 2010లో వచ్చిన ‘ఏమాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాలోనే తన అందం, నటనతో కుర్రకారు మనసును దోచుకున్నారు. ఆ సినిమాలో నాగ చైతన్య, సమంత జోడి అందరిని ఆకట్టుకుంది. ‘ఏమాయ చేశావే’ భారీ హిట్ కొట్టడంతో.. తెలుగులో సమంతకు వరుస ఆఫర్లు వచ్చాయి. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌ అయ్యరు.

2021 అక్టోబర్ 2న తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో చై-సామ్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఈ ఇద్దరు ఏ కారణంతో విడిపోయారని విషయం ఇప్పటికి ఓ పెద్ద మిస్టరీనే. విడాకుల అనంతరం సామ్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే వీరిద్దరి విడిపోయి ఇప్పటికి ఏడాది అవుతున్న.. ఏదో ఒక వార్త వీరి గురించి వస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు తాజాగా నాగ చైతన్య కోసం సామ్ ఎంత పెద్ద తాజాగా చేసింది అంటూ ఓ వార్త వస్తుంది. అదేంటంటే.. బాలీవుడ్ లో చాలా రోజులైనా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు కింగ్ కాంగ్ షారుఖ్ ఖాన్. హిందీలో అందరి డైరెక్టర్లతో ట్రై చేసిన హిట్స్ రాకపోవడంతో..

samantha did great job for Naga Chaitanya

samantha did great job for Naga Chaitanya

Samantha : పాపం స‌మంత‌..

ఇప్పుదు సౌత్ డైరెక్టర్ అట్లీ తో సినిమా చేస్తున్నాడు. జవాన్ అనే టైటిల్ తో వస్తుంది ఈ సినిమా. ఇందులో నయనతార హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ సినిమాను 2019 లోనే అట్లీ అనుకున్న సమయంలో హీరోయిన్ గా సమంత ను అనుకున్నాడట.. ఈ విషయం ఆమెకు చెప్పినప్పుడు.. తాను తానా భర్త చైతన్య అలాగే కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నాను అని చెప్పి ఇందులో నుండి తప్పుకుందట. అయితే తన భర్తతో ఉండాలి అని అంత పెద్ద సినిమా నుండి తప్పుకున్న సామ్ ఇప్పుడు చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఆమె చేసిన ఈ త్యాగం వృధా అయినట్లు అయ్యింది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp