Samantha : అమ‌ల చేసిన ప‌ని వ‌ల్ల‌నే స‌మంత విడాకులు తీసుకుంద‌ట‌..!

Authored By Sam C | The Telugu News | Updated on: October 12, 2022, 8:10 pm

Samantha : స‌మంత విడాకుల విషయం నిత్యం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంది. ఆమెకు సంబంధించిన వార్త‌లు నిత్యం సోష‌ల్ మీడియాలో ఏదో ఒక‌టి హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. అగ్ర హీరోల సరసన వరుస సినిమాలు చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాకుండా యూత్​లో మంచి క్రేజ్​సంపాదించుకున్న సమంత లైఫ్​ను పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అంటూ పోల్చి చూడొచ్చు. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా వరుస సినిమాలు చేసి, అంతకుమించిన పాపులారిటీని సంపాదించుకున్నది. గ‌త కొంత కాలంగా స‌మంత సోష‌ల్ మీడియాకి దూరంగా ఉంటుంది.

అక్టోబర్​2, 2021 తాము విడిపోతున్నట్లు ప్రకటించి నాగ చైతన్య, సమంత ప్రేక్షక లోకాన్ని షాక్​కు గురి చేశారు. ఇక దీని తర్వాత ఎక్కవగా అందరూ సమంతను టార్గెట్​చేస్తూనే పోస్టులు పెట్టడం, వారికి దీటుగా కౌంటర్​ఇవ్వడం వంటివి చాలానే జరిగాయి. సమంత రూ. 250 కోట్ల భరణం తీసుకుందని వంటి రూమర్లు చాలా వచ్చాయి. వాటిపై కాఫీ విత్ కరణ్ టాక్ షోలో క్లారిటీ కూడా ఇచ్చింది సామ్. ఇక తాజాగా అమ‌ల వ‌ల్ల‌నే స‌మంత విడాకులు ఇచ్చింద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. స‌మంత పెళ్లైన కొద్ది రోజుల త‌ర్వాత అమ‌ల‌పై అరిచేసింద‌ట‌. ఈ విష‌యం నాగ్‌కి కూడా కోపం తెప్పించింద‌ట‌.

Samantha divorced because of work Amala

Samantha divorced because of work Amala

Samantha : అదా అస‌లు కార‌ణం?

కొన్నాళ్ల వ‌ర‌కు నాగ్, అమ‌ల‌, నాగ చైత‌న్య వీళ్లంద‌రు స‌మంత‌ని కాస్తం దూరం పెట్టార‌ట‌. ఈ క్ర‌మంలోనే స‌మంత విడాకులు ఇచ్చేందుకు సిద్ధ‌మైన‌ట్టు స‌మాచారం. ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది. ఇక రీసెంట్‌గా స‌మంత బ్లాక్ టీ షర్ట్ ధరించి, టీ షర్ట్ పైన ”యూ విల్ నెవర్ వాక్ ఎలోన్ (నువ్ ఎప్పుడు ఒంటరి ప్రయాణం చేయలేవు)” అని రాసి ఉంది. ఈ మ్యాటర్ నే క్యాప్షన్ లా రాసుకొచ్చి లవ్ సింబల్ ను పెట్టింది సమంత. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు అందరూ ఈ పోస్ట్ నాగ చైతన్యను ఉద్దేశించే పెట్టింది అని కామెంట్ చేస్తున్నారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp