Samantha : పదే పదే గతాన్ని తలుచుకుంటూ కంటతడి పెట్టిన సమంత.. శాకుంతలం ప్రమోషన్స్ లో వెక్కివెక్కి ఏడ్చింది

 Authored By kranthi | The Telugu News | Updated on :25 March 2023,6:00 pm

Samantha : సమంత రుతుప్రభు ప్రస్తుతం శాకుంతలం అనే సినిమాలో నటిస్తోంది. అది మామూలు క్యారెక్టర్ కాదు. చాలెంజింగ్ పాత్ర. ఆ సినిమా షూటింగ్ పూర్తయింది కానీ… ఇంకా విడుదల కాలేదు. ఈ సినిమాలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్ర పోషించారు. గుణ శేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను దిల్ రాజు, నీలిమా గుణ సంయుక్తంగా నిర్మించారు. నిజానికి ఇది ఒక పైరాణిక సినిమా. దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటిస్తుండగా.. సమంత.. శాకుంతల అనే పాత్రలో నటించింది.

samantha emotional interaction with anchor suma

samantha emotional interaction with anchor suma

ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు.ఈ సినిమా విడుదల ఎప్పుడవుతుందో తెలియదు కానీ.. సినిమా ప్రమోషన్స్ మాత్రం స్టార్ట్ చేశారు. ఈసందర్భంగా సమంత.. యాంకర్ సుమతో ముచ్చటించారు. సుమకు సమంత సినిమా ముచ్చట్లను చెప్పుకొచ్చారు. సినిమాను ఎందుకు ఒప్పుకున్నారో.. సినిమా గురించి మొత్తం చెప్పేశారు. సినిమా ముచ్చట్లను చెప్పుకొచ్చిన సమంత.. ఈ సినిమాలో స్పెషల్ గెస్ట్ గా నటించిన అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి చెప్పుకొచ్చింది.

samantha emotional interaction with anchor suma

samantha emotional interaction with anchor suma

Samantha : అల్లు అర్హకు ఇంగ్లీషే రాదు

తను చాలా క్యూట్ గా ఉందని.. అసలు తను తెలుగు చాలా బాగా మాట్లాడుతోందని సమంత చెప్పుకొచ్చింది. తనకు తెలుగు భాష అంత స్పష్టంగా వస్తుందని, హాయ్ అనే పదం కూడా తెలుగులోనే చెబుతోందని.. ఇదంతా తన పేరెంట్స్ క్రెడిట్ అని చెప్పుకొచ్చింది సమంత. ఇంకా.. మధ్య మధ్యలో తన గతం గురించి గుర్తు తెచ్చుకొని బాధపడింది సమంత. సుమతో సమంత ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.

kranthi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి