Samantha : ఉక్రెయిన్ ప్రెసిడెంట్‌ని ఉద్దేశించి సమంత స్ట‌న్నింగ్ పోస్ట్.. షాక్ అవుతున్న నెటిజ‌న్స్

Authored By Sam C | The Telugu News | Published on: March 1, 2022, 11:00 am

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తో పాటు స‌మాజంలో జ‌రిగే ప‌లు అంశాల‌పై కూడా స్పందిస్తుంటుంది. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యపై సమంత స్పందించింది. ఇప్పటికే పలువురు సినీ తారలు ఈ చర్యను తప్పుబట్టారు. యుద్ధం అనేది ఏ కారణాలతో వచ్చినా అది మాత్రం పౌరుల, సైనికుల ప్రాణాలను పణంగా పెట్టడమేనని అన్నారు. ర‌ష్యా చ‌ర్య‌ల‌ను త‌ప్పు ప‌డుతూ స‌మంత వ‌రుస పోస్ట్‌లు చేస్తుండ‌గా, ఇవి నెట్టింట వైర‌ల్‌గా మారుతున్నాయి.ఉక్రెయిన్‌లోని ఓ ఆస్పత్రి ఐసీయూ నుంచి నవజాత శిశువులను బాంబ్‌ షెల్టర్‌లోకి తీసుకెళ్తున్న ఓ వీడియోను తన ఇన్స్‌స్టా స్టోరీలో షేర్‌ చేసిన సమంత.

. అప్పుడే పుట్టిన బిడ్డకు ఎన్ని కష్టాలో అంటూ ఎమోషనల్ కామెంట్ చేసింది. అంతేకాదు యోధుడైన ఉక్రెయిన్ అధ్యక్షుడిని చరిత్ర కనుగొంది. అతని తెగువ, ధైర్యసాహసాలే అందుకు సాక్ష్యం అని పేర్కొన్న ఓ న్యూస్‌ ఆర్టికల్‌ని కూడా సామ్ షేర్ చేసింది. ప్రస్తుతం ఉక్రెయిన్‌ పరిస్థితులపై ఎంతోమంది సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత ఐదు రోజులుగా ఉక్రెయిన్‌ రష్యా బలగాల మధ్య భీకర పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే రెండు దేశాల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌ర‌గ‌గా, అవి అసంపూర్ణంగా మిగిలాయి.ఇక సమంత సినిమాల విషయానికొస్తే..

Samantha emotional post on ukraine issues

Samantha emotional post on ukraine issues

Samantha : స‌మంత స్పంద‌న‌..

ఇటీవలే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా కంప్లీట్ చేసింది. ఆమె కెరీర్‌లో రాబోతున్న తొలి పౌరాణిక సినిమా ఇది. ఇటీవ‌ల ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, ఇది ఎంత‌గానో అల‌రించింది. సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో పాటు మరో ప్రయోగాత్మక సినిమా ‘యశోద’లో భాగమవవుతోంది సమంత. ఈ సినిమాలో నర్స్ పాత్రలో సమంత రోల్ స్పెషల్ అట్రాక్షన్ కానుందని సమాచారం. విడాకుల తర్వాత కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టిన ఆమె.. బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేసేందుకు ఆసక్తి చూపుతోంది.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp