Samantha : ప్రేమ పాటలు అంటూ రచ్చ.. విడాకుల తరువాత సమంత మొదటి పోస్ట్

Authored By Cinema Desk | The Telugu News | Published on: October 7, 2021, 9:50 am

Samantha : సమంత నాగ చైతన్యల విడాకుల తరువాత ఎన్నెన్నో పరిణామాలు జరిగాయి. కొందరేమో సమంతది తప్పు అంటున్నారు. ఇంకొందరేమో అక్కినేని ఫ్యామిలీది తప్పు అంటున్నారు. సమంతను టార్చర్ చేశారంటూ వింత ఆరోపణలు చేస్తున్నారు. అయితే అసలు సంగతి ఏంటన్నది మాత్రం ఆ ఇద్దరికే తెలియాలి. సమంత, నాగ చైతన్యలు ప్రస్తుతానికి భార్యాభర్తలు కాదు. తామిద్దరం కేవలం స్నేహితుల్లానే ఉండబోతోన్నామని ప్రకటించారు. అయితే ఈ ఇద్దరూ విడిపోయి ఇప్పటికే ఐదు రోజులు అవుతోంది.

samantha enjoys with ad shoot

samantha enjoys with ad shoot

అప్పటి నుంచి సమంత సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండటం లేదు. సమంత మామూలుగా అయితే రోజుకు దాదాపు పది స్టోరీలైనా తన ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసేది. కానీ ఇప్పుడు మాత్రం అంత యాక్టివ్‌గా ఉండటం లేదు. మొన్న మాత్రం ఓ పోస్ట్ చేసింది. ఆ ఇన్ స్టా స్టోరీని బట్టి చూస్తే.. ఇక ముందుకు సాగాల్సిందే.. మన పని మనం చేసుకోవాల్సిందే..ఇలా పడుకుంటే గడవదు.. అని ముందకు సాగుతున్నట్టుగా చెప్పకనే చెప్పేసింది.

Samantha : ప్రేమ పాటలపై సమంత..

అయితే తాజాగా సమంత ఓ యాడ్‌కు సంబంధించిన పోస్ట్ చేసింది. పాత ప్రేమకు సంబంధించిన పాటలు, ఎత్తైన కొండలు, పర్వతాల మీద వచ్చే పిల్లగాలులు, మనం కోల్పోయిన కనిపించడం, లోయల్లో కనిపించే పాత ప్రేమికుల పాటలు, పాత బంగ్లాలో వినిపించే గాలి శబ్దాలు అంటూ ఎకో ప్రొడక్ట్స్ గురించి చెప్పింది. లేక్ మీ ఫ్యాషన్ వీక్ అక్టోబర్ 8 జరగబోతోందని సమంత చెప్పింది. మొత్తానికి సమంత మాత్రం ఈ విడాకుల విషయాన్ని లైట్‌గా తీసుకున్నట్టు కనిపిస్తోంది.

Samantha About Saaki One Year Celebrations

Samantha About Saaki One Year Celebrations

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp