Samantha : వావ్ వావ్ వావ్ .. బిగ్ న్యూస్ ఇది.. మళ్ళీ ప్రేమలో పడ్డ సమంత ?

 Authored By prabhas | The Telugu News | Updated on :27 March 2023,6:00 pm

Samantha : అందాల సమంత త్వరలోనే ‘ శాకుంతలం ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 14 న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. దీంతో సమంత ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంది. అయితే తాజాగా సమంత సోషల్ మీడియాలో తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలోనే ఒక అభిమాని సమంత క్యూట్ వీడియోను షేర్ చేసి, మీరు మళ్ళీ డేటింగ్ చేయొచ్చు కదా మళ్లీ ప్రేమలో పడొచ్చు కదా అని పోస్ట్ చేసింది. ఆ అభిమాని పోస్ట్ కు సమంత రిప్లై ఇచ్చింది.

Samantha fall in love again

Samantha fall in love again

మీరు ప్రేమించినంతగా ఎవరు నన్ను ప్రేమిస్తారు అంటూ సమంత ఆ అభిమానికి రిప్లై ఇచ్చింది. అభిమానులను మించి తనను ఇంతగా ఎవరు ప్రేమిస్తారు అంటూ ఇచ్చిన సమాధానం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సమంత మళ్ళీ ప్రేమలో పడే ఉద్దేశం లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం సమంత మళ్ళీ ప్రేమలో పడాలి పెళ్లి చేసుకోవాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత సినిమాల పరంగా దూసుకెళుతోంది. మధ్యలో కొన్ని అనారోగ్య కారణాల వలన సమంత వెనుకడుగు వేసిన ధైర్యంగా ఎదుర్కొని మళ్ళీ సినిమాలలోకి వచ్చింది.

Samantha practicing stunts for citadel series

Samantha practicing stunts for citadel series

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన సమంత బాలీవుడ్ లో కూడా అవకాశాలను అందుకుంటుంది. అక్కడ పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ తన పేరును పాపులర్ చేసుకుంటుంది. ఇక తెలుగులో త్వరలోనే శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే విజయ్ దేవరకొండ ‘ ఖుషి ‘ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. ఏది ఏమైనా సమంత విడాకులు తీసుకున్న తర్వాత సినిమాలపరంగా బాగా దూసుకెళుతోంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి