Samantha : హ‌మ్మ‌య్య‌.. స‌మంత ఫ్యాన్స్ సంతోష‌ప‌డే స‌మ‌యం వ‌చ్చేసింది.. ఇక రెచ్చిపోండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : హ‌మ్మ‌య్య‌.. స‌మంత ఫ్యాన్స్ సంతోష‌ప‌డే స‌మ‌యం వ‌చ్చేసింది.. ఇక రెచ్చిపోండి..!

 Authored By sandeep | The Telugu News | Updated on :31 August 2022,3:40 pm

Samantha: నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత దూకుడు మాములుగా లేదు. వ‌రుస సినిమాల‌తో నానా ర‌చ్చ చేస్తూ హాట్ టాపిక్‌గా మారుతుంది. . ఒకదాని తర్వాత మరోకటి ప్యాన్ ఇండియా సినిమాలతో ఫుల్లు బిజీగా ఉంది. సామ్ విషయానికొస్తే.. తెలుగులో ‘ఏమాయ చేశావే’ సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన బ్యూటీ వ‌రుస హిట్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. స‌మంత ప్రస్తుతం వరుసగా పాన్‌ ఇండియా సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో `యశోద` ఒకటి. డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది.

స‌మంత ఫ్యాన్స్ ఖుషీ..

samantha fans happy with latest update

samantha fans happy with latest update

దర్శక ద్వయం హరి-హరీష్‌ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు. చాలా రోజులుగా చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. జులై, ఆగస్ట్ లో రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ వర్క్‌ కంప్లీట్‌ కాకపోవడంతో డిలే అవుతూ వస్తోంది. ఆ మధ్య ఓగ్లింప్స్ విడుదల చేశారు. అది సినిమాపై అంచనాలను పెంచింది. ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఈ నేపథ్యంలో సడెన్‌గా సర్‌ప్రైజ్‌ రెడీ చేసింది యూనిట్‌. సమంత అభిమానులకు ట్రీట్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్‌ డేట్ ఇచ్చింది. సమంతపై ఒక ఇంటెన్స్ పోస్టర్ ని రిలీజ్ చేసి ఈ సినిమా తాలూకా ఫస్ట్ టీజర్ ని అయితే ఈ సెప్టెంబర్ 9న సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మరి ఈ టీజర్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి మణిశర్మ అయితే సంగీతం అందిస్తుండగా శ్రీదేవి మూవీస్ మరియు ఆసియన్ సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో సంయుక్తగా నిర్మాణం వహిస్తున్నారు.

సమంత తెలుగులో చివరగా `జాను` చిత్రంలో నటించింది. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఇటీవల తమిళంలో నటించిన `కాతు వాకుల రెండు కాదల్‌` చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేశారు. కానీ అది పరాజయం చెందింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సమంత సినిమా కోసం ఆమె అభిమానులే కాదు సాధారణ ఆడియెన్స్ కూడా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది