Samantha : త‌న‌ని ట్రోల్ చేసినందుకు గ‌ట్టిగా స‌మాధానం ఇచ్చిన స‌మంత‌.. ఇక మార‌రా అంటూ పోస్ట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : త‌న‌ని ట్రోల్ చేసినందుకు గ‌ట్టిగా స‌మాధానం ఇచ్చిన స‌మంత‌.. ఇక మార‌రా అంటూ పోస్ట్

 Authored By sandeep | The Telugu News | Updated on :13 March 2022,12:30 pm

Samantha : స‌మంత‌.. ఈ పేరు నిత్యం వార్త‌ల‌లో నిలుస్తుంటుంది. సినిమాల‌తోను, సోష‌ల్ మీడియాల‌తోను స‌మంత తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఎవ‌రెన్నివిమ‌ర్శ‌లు చేసిన కూడా స‌మంత త‌న‌దైన శైలిలో దూసుకుపోతుంది. రీసెంట్‌గా క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డ్స్ ఈవెంట్‌కి వేసుకెళ్లిన స‌మంత చాలా లుక్‌లో క‌నిపించింది. ఆమె డ్రెస్‌పై తెగ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌కి వరల్డ్ స్టార్స్ వేసుకున్నట్లుగా డీప్‌ నెక్ ఎమరాల్డ్ గ్రీన్ అండ్ బ్లాక్‌ ఫ్లోర్‌లెన్త్ గౌన్ వేసుకెళ్లింది. అయితే సమంత ఈ డ్రెస్‌లో అందర్ని ఆకర్షించాలని ప్రయత్నించింది కాని అందరూ ఆమె వేసుకున్న డ్రెస్‌తో అన్‌కంఫర్ట్‌నెస్‌గా ఫీలవడం చూసి తెగ ట్రోల్ చేస్తున్నారు.

సోషల్ మీడియా ఫాలోవర్సే కాదు బాలీవుడ్‌ సెలబ్రిటీలు సైతం సమంత వేసుకున్న డ్రెస్‌ ఏమి బాగోలేదంటూ వెటకారం ఆడుతున్నారు. నేహాశర్మ ఇదేం డ్రెస్ అని కామెంట్ చేస్తే మరొకరు బట్టలు పైన వేసుకోవాలి కాని చీపురులా నేల ఊడవటానికి కాదంటూ సెటైర్లు వేశారు. త్వరగా అవార్డ్‌ ఫంక్షన్‌కి రావాలన్న తొందరలో బెడ్రూంలోని దుప్పటి కూడా లాక్కొచ్చావా అంటూ సోనాల్‌శర్మ టీజ్ చేస్తున్నారు. విప‌రీత‌మైన ట్రోల్స్ చేస్తుండ‌డంతో స‌మంత త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించింది.’ఒక మహిళగా నిర్ణయాన్ని చెప్పడం అంటే ఏంటో నాకు తెలుసు. మహిళల దుస్తులు, చదువు, సామాజిక స్థితి, వారి రూపురేఖలు, కలర్‌.

samantha fire on trollers

samantha fire on trollers

Samantha : అగ్గిమీద గుగ్గిలంగా అయిన స‌మంత‌

. ఇలా ఎన్నోరకాలుగా వారిపై కామెంట్లు చేస్తూ వివక్షను చూపుతుంటారు. మహిళలు వేసుకునే బట్టల ఆధారంగా చాలా ఈజీగా వారిని జడ్జ్‌ చేస్తుంటారు. మనం 2022వ సంవత్సరంలో ఉన్నాం. ఇప్పటికైనా మహిళలను జడ్జ్‌ చేయడం ఆపరా? వారు ఎలాంటి బట్టలు వేసుకున్నారు? ఎలా కనిపిస్తున్నారనేదాన్ని బట్టే స్త్రీలను అంచనా వేయడం మానేసి మనపై మనం దృష్టి సారించగలమా? మీ అభిప్రాయాలను రుద్దడం వల్ల ఎవరికీ మేలు జరగదు’ అంటూ సుదీర్ఘ పోస్ట్‌ షేర్‌ చేసింది స‌మంత‌.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది