Samantha : సమంత..ఆ పేపర్స్‌పై నాగ చైతన్యతో బలవంతంగా సంతకం చేయించిందా?
Samantha : టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ అంటే ఠక్కున గుర్తొచ్చే జంట నాగ చైతన్య-సమంత. వీరిద్దరిని ఎవరు చూసిన కూడా చూడచక్కని జంట అనే వారు. ముఖ్యంగా సమంత విషయానికి వస్తే తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడలో కూడా స్టార్ హీరోయిన్ అయిన సామ్ ఈ మధ్య ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో నటించి బాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రేజ్ ను పుష్ప సినిమాలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ మరింతగా పెంచేసింది. ఇక తన కెరియర్ చాలా పిక్ లో ఉన్నప్పుడే టాలీవుడ్ అక్కినేని హీరో నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది సామ్. వీరిద్దరు పెళ్లి తర్వాత బాగానే కలిసి ఉన్నారు. కానీ ఆ తర్వాత ఏ కారణంగానో తెలియదు కానీ విడిపోయారు.
ఏమాయ చేశావే సినిమాతో అక్కినేని నాగ చైతన్య, సమంత ప్రేమలో పడ్డారు.చాలా ఏళ్లుగా ప్రేమించుకున్న చై-సామ్.. పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ జోడి ఆరంభంలో బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. 2021 అక్టోబర్ 2న తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో చై-సామ్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఈ ఇద్దరు ఏ కారణంతో విడిపోయారని విషయం ఇప్పటికి ఓ పెద్ద మిస్టరీనే. విడాకుల అనంతరం సామ్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. సమంత తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదట. దానికి కారణం..అప్పటికే ఆగిపోయిన అఖిల్ నిశ్చితార్ధం..పైగా తండ్రి రెండో పెళ్ళి..మనకు వద్దు ఇలాంటి వాళ్ళతో సంబంధం అని గట్టిగానే చెప్పారట.

samantha forced naga chaitanya
Samantha : సమంత ఎంత ఆలోచించింది..
కనీ, సమంత మొండిగా ..వాళ్ళను ఒప్పించి ఫైనల్లీ పెళ్లి చేసుకుంది.అయితే, విడాకులు తీసుకోకముందు..చైతన్య సినిమాకి సంబంధించిన మ్యాటర్స్ అన్ని..సమంతనే దగ్గరుండి చూసుకునేదట. ఆ క్రమంలోనే “దూత ” వెబ్ సిరీస్ కధను ముందు వినిపింది సమంతనేనట. ఆమెకు బాగా నచ్చేయడంతో చై కి చెప్పిందట. నెగిటీవ్ షేడ్స్ పాత్ర వద్దు అనుకుని చై ఈ కధను రిజెక్ట్ చేయాలి అనుకుంటున్న తరుణంలో సమంత ..చై దగ్గర బలవంతంగా ఆ వెబ్ సిరీస్ అగ్రిమెంట్ పై సైన్ చేయించిందట. ఓ నటుడి గా ఎదగాలి అంటే అన్ని వేరియేషన్స్ ఉన్న పాత్రలు చెయ్యాలి అనేది ఆమె అభిప్రాయం. అలా చై కి ఇష్టం లేకున్నా సైన్ చేయించిందట.