Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చైతూ నుండి విడిపోక ముందు వరకు సమంత పెద్దగా నెటిజన్స్ ఆగ్రహానికి గురయ్యేది కాదు. ఎప్పుడైతే విడాకులు తీసుకుందో అప్పటి నుండి సామ్ చాలా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇటీవల నాగచైతన్య మరో హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడనే పుకార్లు పుట్టుకొచ్చాయి. దీని వెనుక మాజీ భార్య సామ్ ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు లేటెస్టుగా ‘నాస్టీ’ ట్రోల్స్ ను ఎదుర్కొంటోంది. సద్గురు తో సమంత టాక్స్ కు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది.
అందులో సామ్ ను ఉద్దేశిస్తూ “మీరు కొన్నిసార్లు అందంగా ఉంటారు.. మీరు కొన్నిసార్లు అసహ్యంగా ఉంటారు” అని సద్గురు అన్నారు. దీన్ని ఆమె యాంటీ ఫ్యాన్స్ నెట్టింట షేర్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. జానికి ఒక వ్యక్తి యొక్క వివిధ దశల గురించి మాట్లాడుతూ సాధారణ అర్థంలో సద్గురు ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్భంలోనే బ్యూటీఫుల్ మరియు నాస్టీ అనే కామెంట్స్ చేసారు. అయితే ఓ వర్గం నెటిజన్లు మాత్రం సమంతను అసహ్యకరమైన వ్యక్తిగా చూపించాలనే ఉద్దేశ్యంతో కట్ చేసిన ఆ వీడియో క్లిప్పింగ్ ను వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈమధ్య సామ్ పైనే ఎందుకు ఇంత నెగిటివిటీ వస్తోందనే చర్చ మొదలైంది. ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయినప్పటికీ ఆమెను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. సమంతపై అంత నెగెటివిటీకి కారణం ఆమె ధరించే దుస్తులు కావొచ్చనే టాక్స్ వినిపిస్తున్నాయి.
ఇటీవల రెచ్చిపోయి అందాలు ఆరబోస్తూ సమంత హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఈ క్రమంలోనే ఆమెపై విమర్శలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. సమంత డివోర్స్ ప్రకటన తర్వాత కెరీర్ మీద ఫోకస్ పెట్టింది. వరుసగా సినిమాలు కమిట్ అవుతూ బిజీగా మారిపోయింది. అదే సమయంలో సోషల్ మీడియాలో పరోక్షంగా ఎవరినో ఉద్దేశిస్తూ కొటేషన్స్ పెడుతూ వచ్చింది. మధ్య మధ్యలో తనని విమర్శించే వారికి కౌంటర్లు ఇస్తూ వచ్చింది. అయినప్పటికీ ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ‘యశోద’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ‘శాకుంతలం’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అలానే విజయ్ దేవరకొండ తో కలిసి ‘ఖుషీ’ అనే రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తోంది. వీటితో పాటుగా పలు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ సామ్ చేతిలో ఉన్నాయి.
Allu Arjun Biggest Cutout : పుష్ప 1 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప…
Cashews : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిలలో జీడిపప్పు కూడా ఒకటి. అయితే ఇది మన ఆరోగ్యానికి…
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉందా.. అదేంటి ఆమె లవ్ లో పడ్డ మ్యాటర్…
Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…
Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…
CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 98 పోస్టుల…
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్సి అన్నారు.…
This website uses cookies.