
Samantha : జిమ్ లో చెమటలు కక్కుతున్న సమంత .. వీడియో వైరల్..!
Samantha : సౌత్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోయిన్ గా మారారు. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న టైంలో ఆమెకు మయో సైటీస్ వ్యాధి వచ్చింది. దీంతో ఆమె సినిమాలకు గ్యాప్ ఇస్తూ వస్తున్నారు. ఇక ఆమె తెలుగులో చివరిగా ‘ ఖుషి ‘ సినిమాలో నటించారు. ఇక అనారోగ్య సమస్యల కారణంగా కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సమంత సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.
తాజాగా సమంత సోషల్ మీడియాలో జిమ్ లో వర్కౌట్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోకు క్యాప్షన్ కూడా పెట్టారు. ” ది ఫ్యామిలీ మెన్ 2 #రాజీ #2020 ” అని ఉంది .మరొక పోస్టులో సమంత వర్కౌట్ వీడియోను షేర్ చేశారు. ఇక సమంత హిందీలో ది ఫ్యామిలీ మెన్ 2 లో నటించిన సంగతి తెలిసిందే. అందులో ఆమె రాజీ అనే పాత్రలో నటించారు. తన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు సీటాడెల్ అనే వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధమవుతుంది. రెండు ప్రాజెక్టుల సన్నాహాల నుండి త్రో బ్యాక్ వర్కౌట్ వీడియోలను సమంత పంచుకున్నారు.
స్పై థ్రిల్లర్ డ్రామా ది ఫ్యామిలీ మెన్ 2 లో సమంత రాజీ పాత్రను పోషించారు. ఈ వెబ్ సిరీస్ ను రాజ్ అండ్ డీకే రూపొందించారు. మనోజ్ బాజ్ పేయి ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో షరీఫ్ హష్మీ, ప్రియమణి కూడా నటించారు. ఇక సమంత ఇంస్టాగ్రామ్ స్టోరీస్ సెక్షన్ కి వెళ్లి త్రో బ్యాక్ వీడియో ని షేర్ చేశారు. అందులో వర్కౌట్ చేయడం బ్లాక్ ట్యాంక్ టాప్ ధరించడం మరియు లెగ్గింగ్ లతో సరిపోలడం చూడవచ్చు. వీడియోలో సమంత బరువులు లాగడం కనిపిస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సమంత తదుపరి సినిమా సీటాడెల్ లో నటించబోతున్నారు. ఇందులో వరుణ్ ధావన్ తో కలిసి సమంత స్క్రీన్ ని షేర్ చేసుకుంటున్నారు. దీని తర్వాత చెన్నై కథలు సినిమా లైన్ లో ఉన్నట్లు సమాచారం.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.