Samantha : ఏం ఫిట్ నెస్‌రా బాబు.. సమంత వర్కవుట్లు వైరల్ వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : ఏం ఫిట్ నెస్‌రా బాబు.. సమంత వర్కవుట్లు వైరల్ వీడియో

 Authored By bkalyan | The Telugu News | Updated on :19 November 2021,1:55 pm

Samantha : సమంత ఇప్పుడు తన ఫోకస్ అంతా కూడా కెరీర్ మీద పెట్టేసింది. సినిమాలు పట్టేయాలి.. నటించేయాలనే ధ్యాసలోనే ఉంది. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌లలో నటించాలని ఎక్కువగా తహతహలాడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్‌తో సంప్రదింపులు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అందుకే అక్కడి జనాలతోనే ఎక్కువగా గడుపుతోంది. తాజాగా సమంత సోషల్ మీడియాలో తన స్నేహితులతో కలిసి తెగ సందడి చేసింది.

ప్రీతమ్, సాధన, సమంతలు కలిసి అల్లరి చేశారు. ప్రీతమ్, సమంతలు కలిసి సాధనను రకరకాలుగా హింసించారు. ఆమె మొహానికి వింతగా మేకప్ వేశారు. బ్రైడల్ మేకప్ అంటూ సమంత, ప్రితమ్‌లు ప్రయోగాలు చేశారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే తాజాగా సమంత ఇప్పుడు తన వర్కవుట్ సెషన్ గురించి అందరికీ తెలిసేలా చేసింది. రాత్రి పూట సమంత వర్కవుట్లతో మునిగి తేలింది. ఈ మేరకు సమంత ఫిట్ నెస్ చూసి అంతా ఫిదా అవుతున్నారు.

Samantha Gym Workouts Video

Samantha Gym Workouts Video

Samantha : హీటెక్కించిన సమంత..

అలా సమంత కిందకు మీదకు పైకి లేస్తూ తెగ కష్టపడిపోయింది. ఇందులో సమంత బ్యాక్ కనిపిస్తోంది. అద్దంలో తనను తాను చూసుకుంటూ వర్కవుట్లు చేస్తోంది. ఇక ఇందులో సమంత మెడ మీదున్న టాటూ క్లియర్‌గా కనిపిస్తోంది. మరి మిగతా టాటూలున్నాయో లేదో తెలియడం లేదు. చైతూకి సంబంధించిన ట్యాగ్ సమంత ఒంటి మీద ఇప్పుడుందో లేదో కనిపించడం లేదు. మొత్తానికి వర్కవుట్లతో సమంత దుమ్ములేపుతోంది.

Advertisement
WhatsApp Group Join Now

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది