Home » Entertainment » Samantha Hollywood Movie Uptates
Entertainment

samantha : సమంత కు విడాకులు కలిసొచ్చాయా.. బడా చిత్రాలతో ఫుల్ బిజీగా మారిన యాపిల్ బ్యూటీ!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 3, 2021, 7:00 pm
Advertisement

samantha : తెలుగుతో పాటు సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత…. ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ -2 తో బాలివుడ్ తో పాటు పాన్ ఇండియా నటిగా మంచి గుర్తింపు సంపాదించారు. ఈ హిట్ తో సామ్ కు బాలీవుడ్ లో ఊహించని విధంగా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. వాస్తవానికి చైతూతో విడాకుల అనంతరం డిప్రెషన్ లో సమంత సినిమాలకు దూరం అవుతారని అంతా భావించారు. కానీ వారందరి ఊహాగానాలకు చెక్ పెడుతూ సమంత బిజీ అయిపోయారు. తిరిగి సినిమా కథలను వింటూ క్రేజీ ప్రాజెక్ట్ లను సొంతం చేసుకుంటున్నాడు. టాలీవుడ్, కోలీవుడ్ మాత్రమే కాకుండా బాలీవుడ్ లో అవకాశాలు చేజిక్కిచుకుంటూ హౌరా అనిపించిన సమంత తాజాగా హాలీవుడ్ సినిమాకు సైన్ చేసి అందరి దృష్ణిని తన వైపునకు తిప్పుకున్నారు.

Advertisement

ఈ చిత్రం తర్వాత ఇక సమంత ను అందుకోవడం కష్టమేనని తెలుగు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇక ఈ యాపిల్ బ్యూటీ సమంత… ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి, నయనతార ప్రధాన పాత్రలలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. దాంతో పాటుగా.. తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే పౌరాణిక చిత్రంలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపు కుంటోంది. త్వరలో విడుదల కానున్న ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఇవేకాక సమంత ఇప్పటికే ఓ రెండు భారీ సినిమాలతో బాలీవుడ్ లో యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

samantha hollywood movie uptates

Advertisement

samantha : విడాకుల అనంతరం బిజీగా మారిన సమంత:

ఇదే నిజమైతే సామ్ ఇక ఓ మూడేళ్ల పాటు తెలుగు తెరకు దూరం అవడం ఖాయంగా కనిపిస్తోంది.తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సామ్… అక్కినేని ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి నాలుగేళ్ల తిరగకముందే బయటికొచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. సమంత – చైతు అభిమానులు వీరి విడాకుల షాక్ నుంచి ఇంకా కోలుకోవడం లేదు. అయితే సామ్ ఇవేమీ పట్టనట్టుగా విడాకుల అనంతరం వరుసగా బడా చిత్రాలకు సైన్ చేస్తూ తన దూకుడును కొనసాగిస్తున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి