Samantha: అక్కినేని వారసుడు నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత పెళ్లైన నాలుగేళ్లకు బ్రేకప్ చెప్పిన విషయం తెలిసిందే. విడాలకుల తర్వాత చైతూకి దూరంగా ఉంటున్న సమంత అక్కినేని దగ్గుబాటి ఫ్యామిలీలకు దగ్గరగానే ఉంటుంది. సమంత ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆమె రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మెచ్యూర్ లవ్‌స్టోరీతో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఓ అప్ డేట్ వచ్చింది. ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను టీమ్ తాజాగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఖుషి అంటూ వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది.
ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కశ్మీర్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సమంత నటించిన శాకుంతలం, యశోద చిత్రాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. అయితే తాజాగా ఈ అమ్మడికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. బిగ్ బాస్ హోస్ట్‌గా సమంత చేయనుందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. బిగ్ బాస్ రియాలిటీ షోకు గత మూడు సీజన్స్‌ను నాగార్జునే హోస్ట్ చేశారు. అయితే వచ్చే ఆరవ సీజన్‌కు హోస్టింగ్ చేయనని నాగార్జున చెప్పడంతో బిగ్ బాస్ టీమ్ సమంతను రంగంలోకి దించనుందని అంటున్నారు. ఆరవ సీజన్ త్వరలో మొదలుకానుంది.
ఈ సీజన్‌కు సమంత హోస్ట్ చేయనుందని.. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో. ఇక మరోవైపు సమంత ఆస్తుల గురించి మరోసారి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆమె ఆస్తులు ఎన్ని కోట్లకు ఉంటాయి.. ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారు అంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్స్. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు సమంత ఒక్కో సినిమాకు రెండు నుండి మూడు కోట్లు తీసుకుంటుందని అంటున్నారు. అంతేకాదు సమంత తన పదేళ్ల కెరీర్ లో మొత్తం రూ.100 కోట్లు విలువ చేసే ఆస్తులు సంపాదించిందని టాక్.
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
This website uses cookies.