Home » Entertainment » Pooja Hegde Quit From Pawan Movie
Entertainment

Pooja Hegde : పవన్‌ కల్యాణ్‌ సినిమా నుండి త‌ప్పుకున్న పూజా హెగ్డే.. ఇంత ధైర్యం ఎక్క‌డిది?

Authored By
Sam C
The Telugu News | Published on: June 2, 2022, 9:30 pm
Advertisement

Pooja Hegde : బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉన్న పూజా హెగ్డే ప్ర‌స్తుతం స్టార్ హీరోల సినిమాల‌లో న‌టిస్తూ అల‌రిస్తుంది. బడా హీరోల సరసన అవకాశాలు అందిపుచ్చుకున్న ఈ ‘బుట్టబొమ్మ’ను వరుస ప్లాప్‌లు వెంటాడుతున్నాయి. అయినా పూజా క్రేజ్‌ ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ఎందుకుంటే ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నవన్ని పెద్ద సినిమాలే. అంతేకాదు పలు భారీ చిత్రాల్లో సైతం స్పెషల్‌ సాంగ్స్‌ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.కాగా డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ పవన్‌ కల్యాణ్‌తో భవదీయుడు భగత్‌ సింగ్‌ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఈ మూవీలో పూజా హేగ్డే హీరోయిన్‌ అని ఆ మధ్య హింట్‌ కూడా ఇచ్చాడు. అయితే తాజాగా ఆమె ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత తమిళ చిత్రం ‘వినోదయా సితం’ రీమేక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. పూజా బిజీ..పూజా ప్రస్తుతం త్రివిక్రమ్ – మహేశ్ సినిమాలో చేయనుంది. మరో వైపు విజయ్ దేవరకొండ సరసన ‘జన గణ మన’, బాలీవుడ్‌ మూవీ యనిమల్‌లో స్పెషల్‌ సాంగ్స్‌కు ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో చేతి నిండా ప్రాజెక్ట్స్‌తో ఫుల్‌ బిజీగా ఉన్న పూజా తాను భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్‌ సినిమాలో చేయలేనని హరీశ్ శంకర్‌కు చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

pooja hegde quit from pawan movie

Advertisement

మరి దీనిపై స్పష్టత రావాలంటే చిత్ర బృందం స్పందించే వరకు వేచి చూడాల్సిందే. కాగా పూజా ఇటీవల ఆచార్య మూవీతో పాటు, ఎఫ్‌ 3లో స్పెషల్‌ సాంగ్‌తో అలరించిన సంగతి తెలిసిందే.అల వైకుంఠపురములో సినిమా తర్వాత బుట్ట బొమ్మ హవా అయితే మామూలుగా లేదు అనే చెప్పాలి. స్టార్ హీరోలు ఎక్కువగా ఈ బ్యూటీతో సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. అయితే రీసెంట్ గా మాత్రం పూజా వరుసగా మూడు సినిమాలతో అపజయాలను ఎదుర్కొంది. విజయ్ తో చేసిన బీస్ట్ సినిమా, మెగా మల్టీస్టారర్ ఆచార్య సినిమాతో పాటు ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా కూడా ఊహించని విధంగా దెబ్బ కొట్టింది. దీంతో వరుసగా పూజా హెగ్డే చాలా కాలం తర్వాత బిగ్గెస్ట్ డిజాస్టర్ ను చూసింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి