Samantha:టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జంట నాగ చైతన్య-సమంత. వీరి విడిపోయి మూడు నెలల పైనే అవుతున్నా కూడా విడాకుల వ్యవహారం చర్చనీయాంశంగా మారుతూనే ఉంది. 2021 అక్టోబర్ 2న చై సామ్ జంట విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. విడిపోవడానికి గల కారణాలను వెల్లడించనప్పటికీ ఇప్పటికే ఈ విషయం మీద ఇటు సమంత అటు నాగచైతన్య ఇద్దరూ వివరణ ఇచ్చారు. రీసెంట్‌గా విడాకులపై స్పందించిన నాగ చైతన్య.. ఇద్దరి మంచి కోసం ఈ డెసిషన్ తీసుకున్నామని, దీనివల్ల ఇద్దరం సంతోషం ఉన్నామని పేర్కొన్న సంగతి తెలిసిందే.అక్కినేని నాగార్జున కూడా పలు ఇంటర్వ్యూలలో వీరి విడాకుల వ్యవహారంపై స్పందించారు.
అయితే ‘బాలీవుడ్ లైఫ్’ కథనం ప్రకారం నాగ్ ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకులు కోరుకుంది మొదట సమంత అని వెల్లడించారట. సమంత విడాకులు కోరినప్పుడు చైతూ వెంటనే అంగీకరించాడట. కాని నేను ఏమి ఆలోచిస్తానో.. కుటుంబం యొక్క ప్రతిష్ట ఏమౌతుందో అని నా గురించి ఆలోచించాడట. నేను కంగారుపడతాను అనుకోని చైతన్య నన్ను చాలా ఓదార్చాడు. వీళ్లిద్దరూ మ్యారేజ్ లైఫ్ లో 4 ఏళ్లు కలిసి ఉన్నారు. కానీ వాళ్ల మధ్య ఎలాంటి సమస్య రాలేదు. ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉన్నారు. ఈ నిర్ణయానికి ఎలా వచ్చారో నాకు తెలియదు అని నాగార్జున అన్నారట.రీసెంట్ గా నాగ చైతన్య తన ఆన్ స్క్రీన్ పెయిర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. తన బెస్ట్ ఆన్ స్క్రీన్ పై సమంతనే అని తెలిపి నాగ చైతన్య అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
ఇద్దరూ విడిపోయారు కాబట్టి చైతు.. సమంత పేరు చెబుతాడా లేదా అనే సందేహం ఉండేది. కానీ నాగ చైతన్య మాత్రం తన బెస్ట్ ఆన్ స్క్రీన్ పై సమంతానే అని తేల్చి చెప్పాడు. వీరిద్దరూ ఏమాయ చేశావే, మనం, మజిలీ, ఆటో నగర్ సూర్య లాంటి చిత్రాల్లో నటించారు. వెండి తెరపై చైతు, సమంత సూపర్ హిట్ జోడిగా గుర్తింపు పొందారు. తాను నటించిన చిత్రాల్లో దేన్నైనా బాలీవుడ్ లో రీమేక్ చేయాల్సి వస్తే ఏ చిత్రం ఎంచుకుంటారు అని ప్రశ్నించగా చైతు ‘మజిలీ’ మూవీ పేరు చెప్పాడు. ఈ చిత్రంలో నాగ చైతన్య, సమంత కలసి నటించిన సంగతి తెలిసిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.