Pushpa : దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రైజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదనుకుంట. పాన్ ఇండియన్ మూవీగా రిలీజైన పుష్ప ఏకంగా పాన్ వరల్డ్‌గా మారిపోయింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్, మాస్ లుక్స్, స్టెప్పులకు అందరు ఫిదా అయ్యారు. ఏకంగా ఇంటర్నేషనల్ క్రికెటర్స్ సైతం పుష్పను ఫాలో అవుతున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్, వెస్టిండీస్ ప్లేయర్ బ్రావో, రవింద్ర జడేజా, ఇషాన్ కిషన్ లాంటి వారు శ్రీవల్లి పాటలో బన్నీ స్టెప్పులను కాపీ కొట్టారు. ఇక తగ్గేదేలే డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలుసు. మీమ్స్ కూడా అంతే రేంజ్‌లో వస్తున్నాయి. కలెక్షన్ల పరంగానూ ఈ సినిమా దుమ్ములేపింది. బాలీవుడ్‌లో పుష్పను చూసి అక్కడి దర్శకనిర్మాతలు షాక్ అవుతున్నారట. అయితే, పుష్ప సినిమా కథను ముందుగా విని ఎవరెవరు వదులుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
పుష్ప సినిమా కోసం సుకుమార్ చాలామందిని అనుకున్నారట. హీరో దగ్గర నుంచి విలన్ పాత్ర వరకు పలువురిని సంప్రదించారట. ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నారు. 1 నేనొక్కడినే సినిమా తర్వాత మహేష్ బాబుతో ఓ మాస్ సినిమా చేయాలని సుకుమార్ భావించారట.. అదే పుష్ప. అయితే, మహేశ్ బాబు ఇతర సినిమాలతో బిజీగా ఉండటం, పైగా లుక్స్ పరంగానూ భిన్న అభిప్రాయాలు రావడంతో మహేష్ ఈ సినిమాను వదులుకోవడంతో పుష్ప మూవీ అల్లు అర్జున్ దగ్గరకు చేరింది.అదేవిధంగా హీరోయిన్ కోసం సమంతను అనుకున్నాడట సుకుమార్. గతంలో సుకుమార్ తీసిన రంగస్థలం సినిమాలో రామలక్ష్మీగా నటించి ఆకట్టుకుంది సమంత. దాంతో ఈ సినిమాలో శ్రీవల్లిగా చూపించాలని అనుకున్నారట. పలు కారణాల వల్ల సమంత నో చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ లోకి రష్మిక వచ్చి చేరింది. పుష్పలో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసి అలరించింది సమంత.
ఊ అంటావా మామ.. ఊఊ అంటావా మామ పాటకు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికోసం ముందుగా బాలీవుడ్ హీరోయిన్స్ దిశా పాటని , నోరా ఫతేహిను సంప్రదించారట. వీరు నో అనడంతో సామ్ ఎంటరైంది. ఇక విలన్ పాత్రకోసం ముందుగా తమిళ్ హీరో విజయ్ సేతుపతిని ఎంపిక చేశారు. షికావత్ పాత్రకోసం ముందుగా సేతుపతిని అనుకుంటే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆయన సినిమాను వదులుకున్నాడు. తర్వాత బెంగాలీ నటుడు జిష్ణు సేన్ గుప్తా, టాలీవుడ్ హీరో నారా రోహిత్‌లను కూడా సంప్రదించారట. వాళ్ళు కూడా నో చెప్పడంతో ఆ ఛాన్స్ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్‌కు దక్కింది. తీరా ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ను చూసి వారంతా ఇప్పుడు ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.