Samantha : నేనేమీ పర్ఫెక్ట్ కాదు!.. అసలు విషయం చెప్పిన సమంత

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 2 November 2021, 5:10 pm

Samantha  సమంత ఈ మధ్య ఎంతలా బిజీగా మారిందో అందరికీ తెలిసిందే. తన స్నేహితులతో కలిసి సమంత చేస్తోన్న రచ్చ మామూలుగా ఉండటం లేదు. సాధన, ప్రీతమ్‌లతో కలిసి సమంత తెగ తిరిగేస్తోంది. ఇక మొన్నటి వరకు దుబాయ్‌లో నానా హంగామా చేసిన సమంత హైద్రాబాద్‌కు వచ్చినట్టు కనిపిస్తోంది. ఇక ఇండియాకు వచ్చిన సమంత తన రెగ్యులర్ పనుల్లో పడింది. తన పెట్స్‌తో కలిసి తెగ ఆడుకుంటోంది. వాటి అల్లరిని చూసి మురిసిపోతోంది. హష్, సహస్రలు ఇద్దరూ కూడా ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే.

samantha inspirational quote

samantha inspirational quote

హష్ వెనకాలే సహస్ర ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. ఈ రెండూ ఎప్పుడూ పోట్లాటలుపెట్టుకుంటాయి. అయితే తాజాగా సహస్ర ఇలాంటి ఓ పని చేసేందుకు రెడీగా ఉందట. హష్‌ను కొరికేందుకు బాగానే ప్రయత్నించిందట. అందులో భాగంగా సమంత అంటే భయం ఉండటంతో సహస్ర సైలెంట్‌గా ఉందట. తాను ఉన్నాననే భయంతోనే అలా దూరంగా ఉంటోందని సమంత చెప్పుకొచ్చింది. మొత్తానికి పెట్స్‌కు సమంత భయాన్ని నేర్పిచిందన్న మాట.

Samantha  సమంత కొటేషన్ వైరల్..

samantha in dubai

samantha in dubai

తాజాగా సమంత ఓ కొటేషన్‌ను షేర్ చేసింది. అందులో అమ్మ చెప్పిందంటూ కొన్ని మాటలు మాట్లాడింది. తాను ఎంతో బలవంతైమనదాన్ని అని, పర్ఫెక్ట్ కాకపోయినా, తనకు తాను పర్ఫెక్ట్ అనిపిస్తుందని చెప్పుకొచ్చింది. సవాళ్లను మధ్యలో ఎప్పుడూ వదిలేయను అని, నేను ఓ మానవత్వం ఉన్న మనిషిని, పోరాట యోధురాలిని అని సమంత తెలిపింది. మొత్తానికి సమంత ఈ కొటేషన్‌ను షేర్ చేయడం వెనుకున్న ఉద్దేశ్యం ఏంటో గానీ సమంత రచ్చ రచ్చ చేస్తోంది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి