Home » Entertainment » Samantha Instagram Posts Going Viral
Entertainment

Samantha : జీవితంలో తాను నేర్చుకున్న పెద్ద గుణపాఠమదే ఇదే అంటూ సమంత సంచలన పోస్ట్..!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 5, 2021, 1:40 pm
Advertisement

Samantha : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి సమంత.. అక్కినేని ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి నాలుగేళ్ల తిరగకముందే బయటికొచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. విడాకులు అనంతరం సామ్ కానీ.. అక్కినేని కుటుంబం కానీ ఈ విషయంపై గురించి కానీ ఎక్కడా మాట్లాడటానికి ఇష్ట పడలేదు. విడాకుల కారణంగా సామ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుందేమో అనుకున్న అభిమానుల ఊహ గానాలకు చెక్ పెడుతూ బడా చిత్రాలకు వరుసగా సైన్ చేస్తూ తన దూకుడును కొనసాగిస్తోంది.ప్రస్తుతం సమంతా తన బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. నిత్యం ఎవరికో ఒకరికి పరోక్షంగా ఏదో ఒక పోస్టు పెడుతూ అభిమానులను ఆలోచనల్లో పడేస్తోంది.

Advertisement

Samantha : వైరల్ అవుతున్న సామ్ పోస్టులు

ముఖ్యంగా సమంత షేర్ చేస్తున్న పలు కొటేషన్లు సామజిక మాధ్యమాలలో ఈమధ్య బాగా వైరల్ అవుతున్నాయి. విడాకుల తర్వాత నుంచి ఏదో ఒక సూక్తిని షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది సమంత. తాజాగా అమ్మ చెప్పిందంటూ… మరి కొన్ని కొటేషన్లను షేర్ చేసింది. తాను జీవితంలో నేర్చుకున్న గుణపాఠం ఇదేనంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయితే జీవితంలో తను నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందనే విషయాన్ని తెలుసుకున్నాను అని తెలిపింది. అయితే సామ్ మొదటి నుంచి ఇలాగే పరోక్షంగా పోస్టులు పెడుతూ ఉండటం గమనార్హం. ఇప్పుడు వాటిని డీకోడ్ చేయలేక అసలు సామ్ ఆ పోస్టులు ఎందుకు పెడుతుందో అర్థం కావడం లేదంటున్నారు.

samantha instagram posts going viral

Advertisement

Samantha : బడా చిత్రాలతో ఫుల్ బిజీగా మారిన సామ్

ఇదిలా ఉండగా సామ్ విడాకుల అనంతరం ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి, నయనతార ప్రధాన పాత్రలలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తోంది. దాంతో పాటుగా.. తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే పౌరాణిక చిత్రంలో నటించింది.ఇక సమంత పుష్ప సినిమాలో చేయబోతోన్న స్పెషల్ సాంగ్ మీద కూడా అంచనాలు పెరిగిపోయాయి. బాలీవుడ్ లో ఇప్పటికే యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థలో ఓ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో అవకాశాలు చేజిక్కిచుకుంటూనే హౌరా అనిపించిన సామ్ తాజాగా హాలీవుడ్ సినిమాకు సైన్ చేసి అందరి దృష్ణిని తన వైపునకు తిప్పుకున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి