Samantha : సమంత లేటెస్ట్ ఫోటోలు చూస్తే.. మెంటలెక్కిపోవడం ఖాయం

Authored By mallesh | The Telugu News | Published on: March 8, 2022, 1:30 pm

Samantha : తెలుగులో ‘ఏమాయ చేశావే’ సినిమాతో పరిచయమై కుర్రకారును తనదైన మాయలో పడేసిన హీరోయిన్ సమంత. ఆ సినిమా తర్వాత బృందావనం, ఈగ వంటి బ్లాక్ బస్టర్ హిట్‌లతో స్టార్ హీరోయిన్‌గా సమంత ఎదిగింది. ఆ తర్వాత నాగచైతన్యతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుని అక్కినాని వారి ఇంటికి కోడలుగా వెళ్లింది. అక్కినేని కోడలుగా సమంతకు మరింత క్రేజ్ వచ్చింది. అయితే ఇంతలోనే నాగచైతన్యతో విడాకులు తీసుకుని సమంత అందరినీ ఆశ్యర్యపరిచింది.గత ఏడాది అక్టోబర్‌లో విడాకుల ప్రకటన చేసినా ఇప్పటికీ ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది.

నాగచైతన్య, సమంత విడాకులకు కారణం ఎవరికీ అంతుబట్టడం లేదు. మరోవైపు సమంత వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆమె చేతిలో గుణశేఖర్ శాకుంతలం సినిమాతో పాటు తమిళంలో విజయ్ సేతుపతి మూవీ, ఇంకా పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.అయితే విడాకులు తీసుకున్న తర్వాత సమంత సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా ఆది వైరల్ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె చేసిన మరో పోస్ట్ వైరల్ అవుతోంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘త్వరలో ఓ మంచి జరగనుంది.. గుర్తుంచుకోండి..’ అంటూ ఓ కోట్ షేర్ చేయగా అది వైరల్‌ అవుతోంది.

Samantha latest photos in Viral

Samantha latest photos in Viral

Samantha : సోష‌ల్ మీడియ‌లో ఏది పెట్టినా వైర‌లే..

అంతేకాకుండా ఇటీవల తాను దిగిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేయగా అందులో సమంతను చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతోంది.కాగా గుణశేఖర్ శాకుంతల మూవీ ఇటీవల షూటింగ్ పార్ట్‌ కంప్లీట్ అయ్యింది. పౌరాణిక నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఈ సినిమాలో దర్శకుడు గుణశేఖర్ చూపించనున్నాడు. ఈ కథను మహాభారతంలోని ఆదిపర్వం నుంచి తీసుకున్నాడు. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్‌ మోహన్‌ నటించాడు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp