Samantha : ఆహా.. ఏమందం ఇది.. గ్రీకు శిల్పంలా క‌నిపిస్తున్న స‌మంత‌.. కుర్రాళ్ల గుండెలు గ‌ల్లంతు

Authored By Sam C | The Telugu News | Published on: February 21, 2022, 10:00 am

Samantha : ఇటీవ‌లి కాలంలో స‌మంత తెగ సెన్సేష‌న్ అవుతుంది. నిత్యం ఏదో ఒక విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తుంది. ఈ ముద్దుగుమ్మ చేసే ర‌చ్చ‌కు సోష‌ల్ మీడియా షేక్ అయిపోతుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సమంత ఇటీవల ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. రంగస్థలం సినిమా తర్వాత ఆమె స్థాయి మరింత పెరిగిందనే చెప్పాలి.అంతే కాకుండా మధ్యలో వచ్చిన ఓ బేబీ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో ఆమెకు సినిమాలు చాలానే వస్తున్నాయి.

ప్ర‌స్తుతం స‌మంత ఎక్కువ‌గా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంది.మరోవైపు సోష‌ల్ మీడియాలోను తెగ యాక్టివ్‌గా ఉండే స‌మంత త‌న‌కు సంబంధించిన ప్ర‌తి అప్‌డేట్ షేర్ చేస్తూ ఉంటుంది. రీసెంట్‌గా స‌మంత తాజా కేరళలోని అతిరప్పిల్లీ వాటర్ ఫాల్స్ వెళ్లి అక్కడి బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో ఫొటోలకు పోజులిచ్చింది. ఇక వాటిని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఎగిసిపడుతున్న ఆ జలపాతాలను జీవితంతో పోల్చుతూ సమంత పెట్టిన కొటేషన్ ఆలోచింపజేస్తోంది. స‌మంత పెట్టిన ఫొటోలు తెగ వైర‌ల్ కాగా, ఇప్పుడు ఆమె షేర్ చేసిన మ‌రో ఫొటో అద‌ర‌గొడుతుంది.

Samantha latest photos in viral

Samantha latest photos in viral

Samantha : అందాల‌తో మ‌తులు పోగొట్టేస్తుందిగా..

చీర క‌ట్టులో క‌నిపించి క‌నిపించ‌ని అందాలు ఆర‌బోస్తూ మైమ‌ర‌చిపోయేలా చేస్తుంది స‌మంత‌. ఈ అమ్మ‌డిని చూసి గ్రీకు శిల్పంలా ఉన్నావ‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. స‌మంత గ్లామ‌ర్ పీక్స్‌లో ఉందని కొంద‌రు అంటున్నారు. ఏదేమైన స‌మంత ఇటీవ‌లి కాలంలో క్రియేట్ చేస్తున్న మ్యాజిక్ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్నాయి. ప్ర‌స్తుతం ఆమె స్ట‌న్నింగ్ పిక్ తెగ వైర‌ల్ అవుతుంది. ప్ర‌స్తుతం స‌మంత‌..గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘శాకుంతలం’ మూవీ కంప్లీట్ చేయ‌గా, ఇప్పుడు ‘యశోద’ అనే సినిమాలో నటిస్తోంది.విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న ‘కాతు వాకుల్ రెండు కాదల్’ అనే సినిమాలో, ఓ ఇంటర్నేషనల్ వెబ్ ఫిల్మ్ లోనూ నటిస్తోంది

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp