Samantha : సమంత డ్రెస్ చూసి నెటిజన్లు షాక్.. క్లీవేజ్ షోతో సెగలు
Samantha : సమంత అందాలను ఆరబోస్తే అది వేరే లెవెల్‌లో ఉంటుంది. మామూలుగానే సమంత అందాల ప్రదర్శనకు ముందుంటుంది. అక్కినేని కోడలిగా ఉన్న సమయంలోనే బికినీ ఫోటోలతో నానా హంగామా చేసింది. ఆ సమయంలో ఆడవారు ధరించే దుస్తులు, వాటి అభ్యంతరాలు చేసే వారిపై రకరకాల చర్చలు జరిగాయి. అయితే సమంత అలా బికినీ ఫోటోలను షేర్ చేయడంతో అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తరువాత ఆ ఫోటోను డిలీట్ చేసేసింది.

Samantha Latest Pic With Firends Goes Viral
ఆ తరువాత మరోసారి బాత్ టబ్బులో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోను షేర్ చేసింది. అది కూడా హాట్ టాపిక్ అయింది. మొత్తానికి సమంత ఎప్పటికప్పుడు అలా అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఒకప్పుడు అడ్డు చెప్పేవారు ఉండేవాళ్లు. అక్కినేని అంటూ హద్దులు గీసేవారున్నారు. కానీ ఇప్పుడు ఎవ్వరూ లేదు. దీంతో సమంత తనకు ఇష్టమొచ్చినట్టుగా దుమ్ములేపుతోంది. తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి
Samantha : సమంత అందాల జాతర..

Samantha Latest Pic With Firends Goes Viral
సమంత గ్యాంగ్ గురించి అందరికీ తెలిసిందే. చిన్మయి, నందినీ రెడ్డి, డాక్టర్ మంజుల, సాధన సింగ్, శిల్పా రెడ్డి, ప్రీతమ్ ఇలా వీరంతా కూడా సమంత గ్యాంగులోని మెంబర్లు. అయితే వీరిలో డాక్టర్ మంజుల అనగాని బర్త్ డే నేడు. దీంతో సమంత ఆమెతో కలిసి పార్టీ చేసుకున్న ఫోటోను షేర్ చేసింది. అందులో సమంత ధరించిన దుస్తులు మామూలుగా లేవు. క్లీవేజ్ షోతో కాక రేపేసింది. సమంత అందాల విందుకు అందరూ నోరెళ్లబెడుతున్నారు.