Samantha : స‌మంత సినీ కెరీర్‌కు 12 ఏళ్లు.. అయినా తగ్గని అందం..

Authored By mallesh | The Telugu News | Updated on : 26 February 2022, 1:04 pm

Samantha : స‌మంత అంటే ప్ర‌త్యేకంగా ఎవ్వ‌రికీ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌రి నుంచి పెద్ద వారి దాకా సౌత్ ఇండియాలో అంద‌రికీ సుప‌రిచితురాలే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వ‌చ్చి సౌత్ స్టార్ హీరోయిన్ గా ద‌శాబ్దం పాటు చ‌క్రం తిప్పింది. ఎన్నో మ‌రుపు రాని సినిమాల‌తో కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాదించు్కుంది. చాలామంది హీరోయిన్లు చాలా త్వ‌ర‌గా స్టార్ డ‌మ్ తెచ్చుకుని అంతే త్వ‌ర‌గా క‌నుమ‌రుగైపోయారు.

కానీ స‌మంత మాత్రం దాదాపు ప‌దేండ్ల‌కు పైగా ఇప్ప‌టికీ స్టార్ హీరోయిన్ గానే కొన‌సాగుతోంది. అయితే నేటితో ఆమె ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 12ఏండ్లు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో ఆమె ఫ్యాన్ పేజీలు ఆమెకు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాయి. ఆమె అభిమానులు పోస్టుల‌తో హోరెత్తిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టుల‌తో సోష‌ల్ మీడియా ఊగిపోతోంది.

samantha latest pics in viral

samantha latest pics in viral

Samantha : ఇంకా త‌గ్గ‌ని క్రేజ్‌..

12ఏండ్లు పూర్త‌యినా కూడా ఆమె స్టార్ డ‌మ్ ఇంకా త‌గ్గ‌లేదు. ఆమె ప్ర‌స్తుతం శాకుంత‌లం అనే ప్యాన్ ఇండియా మూవీలో న‌టిస్తోంది. దాంతో పాటు కార్తీ మూవీలో కూడా చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే గ‌తేడాది ఆమె నాగ‌చైత‌న్య‌తో విడిపోవ‌డం ఆమె జీవితంలో మ‌రిచిపోలేని చేదు జ్ఞాప‌క‌మే. ఇది ఆమె ప్యాన్స్‌కు పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. కాగా అవ‌న్నీ ఆమె మ‌ర్చిపోయి ఇప్పుడిప్పుడే త‌న కెరీర్ పై దృష్టి పెడుతోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి