Samantha : నాగ చైత‌న్య‌ ని సక్సెసఫుల్ గా మర్చిపోయి .. వేరే అతని ప్రేమలో సమంత?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : నాగ చైత‌న్య‌ ని సక్సెసఫుల్ గా మర్చిపోయి .. వేరే అతని ప్రేమలో సమంత??

 Authored By sandeep | The Telugu News | Updated on :12 October 2022,10:30 am

Samantha: అక్కినేని నాగ చైత‌న్య‌ని వివాహం చేసుకొని అక్కినేని కోడ‌లిగా మారిన స‌మంత కొన్నాళ్ల‌కు అత‌నికి బ్రేక‌ప్ చెప్పి ఆ ఫ్యామిలీకి దూరంగా ఉంటుంది. విడాకులు తీసుకున్న ద‌గ్గ‌ర నుండి స‌మంత తెగ వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. అయితే ఇటీవ‌ల ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుంద‌ని తెగ ప్ర‌చారం జ‌రిగింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అయిన సద్గురు ని సమంత ఎక్కువగా ఆరాధిస్తుంది.. గౌరవిస్తుంది. రెగ్యులర్ గా ఆయన కార్యక్రమాలకు హాజరవుతుంది. విడాకులు తీసుకున్న సమయంలో డిప్రెషన్ కి లోన్ కాకుండా సమంత ఆయన యొక్క బోధనలు విని డిప్రెషన్ నుండి బయటకు వచ్చినట్లుగా కొందరు అంటూ ఉంటారు.

సమంత‌ని రెండో పెళ్లి చేసుకోమని సద్గురు సూచించారట.సమంత రెండవ పెళ్లి విషయంలో ఆసక్తిగా లేదని.. కానీ తాను ఎంతగానో ఆరాధించే, గౌరవించే వ్యక్తి రెండో పెళ్లి గురించి సలహా ఇవ్వడంతో సమంత ఆలోచనలో పడ్డట్లుగా పుకార్లు షికారులు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో స‌మంత ధ‌రించిన టీ ష‌ర్ట్ ఇప్పుడు అంద‌రిలో అనేక అనుమానాలు క‌లిగిస్తుంది. నువ్వు ఎప్పుడు ఒంట‌రిగా న‌డ‌వ‌వు అని స‌మంత టీష‌ర్ట్‌పై రాసి ఉంది. దీంతో స‌మంత ప్రేమ‌లో ప‌డింద‌ని, ఆమె పెళ్లి త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నుంద‌ని అంటున్నారు. గ‌తంలో స‌మంత ప్రేమ‌, పెళ్లిపై ఆస‌క్తి లేద‌ని చెప్ప‌గా, ఇప్పుడు ఇలాంటి టీష‌ర్ట్ ధ‌రించ‌డంతో అంద‌రిలో అనేక ఆలోచ‌న‌లు మొద‌లుతున్నాయి.

samantha marries to be soon

samantha marries to be soon

Samantha : పెళ్లి ఘ‌డియ‌లు…

ఇక సమంతకి రెండో పెళ్లి ఆలోచనలోనే లేదని.. ప్రస్తుతం అనారోగ్య కారణాలు ఉండటంతో.. వాటి నుంచి కోలుకున్న తరువాత ఫుల్ ఫోకస్ సినిమాలపై పెడుతుందట. టాలీవుడ్.. బాలీవుడ్.. ఆ తరువాత హాలీవుడ్ రేంజ్‌లో ఎదగాలని సమంత ప్లానింగ్‌లో ఉన్నట్టు ఆమెకు టచ్‌లో ఉన్న మీడియా మిత్రులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ రెండో పెళ్లి వార్త గాసిప్ మాత్రమే అంటున్నారు. ఇక స‌మంత న‌టించిన శాకుంత‌లం చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ నటించారు. మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి, కబీర్ దుహాన్ సింగ్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది