Samantha : ఇక్క‌డ ఫ‌స్ట్ ప్లేస్ కొట్టిన స‌మంత అక్క‌డ సెకండ్ ప్లేస్

Authored By Sam C | The Telugu News | Published on: May 16, 2022, 7:00 pm

Samantha : ఒక‌ప్పుడు అక్కినేని కోడ‌లిగా ఉంటూ తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌ర‌గా ఉన్న స‌మంత ఇప్పుడు రెక్క‌లు వ‌చ్చిన ప‌క్షిలా ఎగురుతుంది. కోలీవుడ్, బాలీవుడ్‌లోను సినిమాలు చేస్తుంది. తాజాగా విజయ్‌, సమంతల మూవీకి ఖుషి టైటిల్‌ను ఖరారు చేస్తూ ఓ పోస్టర్‌ వదిలారు. ఇందులో విజయ్‌ డ్రెస్సుకు, సమంత చీరకు ముడివేసినట్లుగా ఉంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్‌ 23న రిలీజ్‌ కానున్నట్లు వెల్లడించారు. ఖుషి మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై వై.రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని నిర్మిస్తున్నారు.

అయితే సమంత ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని దాటుకుని నిలబడగలనని నిరూపించుకుంది. ఒకప్పుడు స్ట్రగుల్స్ మధ్య ప్రారంభమైన ఆమె జీవితం ఇప్పుడొక వ్యవస్థలా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఆమె లైఫ్‌ కొత్తగా సినీ రంగంలోకి వస్తున్న ఎంతో మంది హీరోయిన్లకి, అలాగే అమ్మాయిలకు స్ఫూర్తిదాయకం. అదే ఇప్పుడు సమంతని నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంచింది. మిగిలిన కమర్షియల్‌ స్టార్‌ హీరోయిన్లని దాటుకుని సమంత టాప్‌ ప్లేస్‌లో నిలిచేలా చేసింది. మీడియా కన్సల్టింగ్‌ సంస్థ ఓర్మాక్స్ మీడియా ఈ ఏడాది(2022)కి తెలుగు, తమిళం, హిందీ, హాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్‌ నటీనటుల జాబితాలను విడుదల చేసింది.

samantha most popular person

samantha most popular person

Samantha : త‌గ్గేదే లే అంటున్న స‌మంత‌..

ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో తెలుగు హీరోయిన్ల జాబితాలో సమంత నెంబర్‌ 1 పొజిషియన్‌ దక్కించుకుంది.మోస్ట్ పాపులర్‌ టాలీవుడ్‌ హీరోయిన్లలో సమంత మొదటి స్థానం దక్కించుకోవడం విశేషం. రెండో స్థానంలో కాజల్‌, మూడో స్థానంలో అనుష్క, నాల్గో స్థానంలో పూజా హెగ్డే, ఐదో స్థానంలో రష్మిక మందన్నా, ఆరో స్థానంలో తమన్నా, ఏడో స్థానంలో కీర్తిసురేష్‌, ఎనిమిదో స్థానంలో సాయిపల్లవి, తొమ్మిదో స్థానంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, పదో స్థానంలో రాశీఖన్నా నిలిచారు. మరోవైపు తమిళ హీరోయిన్ల జాబితాలోనూ సమంత టాప్‌ ప్లేస్‌లో నిలవడం విశేషం. అయితే అక్కడ ఆమె రెండో స్థానానికే పరిమితమయ్యింది. మొదటి స్థానంలో నయనతార నిలిచారు

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp