Samantha : సమంత నాగచైతన్య దెబ్బకు లేడీ డైరెక్టర్ బలి.. అసలేం జరిగిందంటే…
Samantha : టాలీవుడ్‌లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య వారి వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టి నెలలు గడుస్తోంది. కానీ ఈ విషయంలో సోషల్ మీడియాలో ఏదో రకంగా ఇంకా వైరల్ అవుతూనే ఉంది. వీరిద్దరు విడిపోయాక ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ముఖ్యంగా వారి సినీ కెరీర్ పై ఫోకస్ పెట్టారు. ఇక వీరిద్దరి వల్ల ఒక లేడీ డైరెక్టర్ బలికావాల్సి వచ్చిందట. ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
తమ మ్యారేజ్ కు ముందు లేడీ డైరెక్టర్ తో సమంత, నాగచైతన్య చాలా చనువుగా ఉండేవారు. ఈ క్రమంలో సమంత, నాగచైతన్య కాంబినేషన్ లో మజిలి మూవీ వచ్చి మంచి హిట్ అందుకుంది. జబర్దస్త్ అనే మూవీతో డైరెక్టర్‌గా లేడీ డైరెక్టర్ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో సమంత యాక్ట్ చేసింది. అప్పటి నుంచి వీరద్దరు మంచి ఫ్రెండ్స్‌గా మారారు. దీని కారణంగానే ఆహాలో టెలికాస్ట్ అయ్యే సామ్ జామ్ ప్రోగ్రాంలోనూ సమంతతో కలిసి సందడి చేసింది లేడీ డైరెక్టర్. ఈ క్రమంలో సమంత, నాగచైతన్యతో ఓ మూవీ చేయాలని ప్లాన్ చేసిందట.

samantha nagachaitanya blow to the lady director
Samantha : అసలు ఏం జరిగిందంటే..
కానీ అంతలోనే వీరిద్దరూ విడిపోవడంతో ఆమె ఆశలు అడియాశలయ్యాయి. ప్రస్తుతం ఇద్దరితో కలిసి మూవీ చేసే చాన్స్ లేకపోవడంతో ఎవరైనా ఒక్కరు ఒప్పుకుంటే వారితోనే మూవీ చేయాలని ట్రై చేస్తోందట. కానీ ఇందుకు ఇటు సమంత నుంచి గానీ, అటు నాగచైతన్య నుంచి గానీ ఎలాంటి రిప్లై రావడం లేదట. వీరిద్దరూ ఆ లేడీ డైరెక్టర్‌ను పక్కన పెట్టేశారని టాక్. ఇదిలా ఉండగా ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌ను దాటి హాలీవుడ్ రేంజ్‌కు ఎదిగింది సమంత. ప్రస్తుతం చేతినిండా మూవీస్ తో చాలా బిజీగా ఉంటోంది. శాకుంతలం, యశోదా వంటి పెద్ద మూవీస్ లో యాక్ట్ చేస్తోంది.