Samantha : డోసు పెంచిన సమంత‌.. ఈ అందాల ఆర‌బోత ఏంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : డోసు పెంచిన సమంత‌.. ఈ అందాల ఆర‌బోత ఏంది..!

Samantha : అక్కినేని మాజీ కోడ‌లు స‌మంత త‌గ్గేదే లే అంటుంది. ఒక‌ప్పుడు గ్లామ‌ర్ షో విష‌యంలో కాస్త ఆలోచించే స‌మంత ఇప్పుడు మాత్రం అడ్డంకులు అన్నింటిని ప‌క్క‌న పెట్టిన‌ట్టుగా క‌నిపిస్తుంది. స‌మంత ఒక‌వైపు వ‌రుస సినిమాలు చేస్తూనే మ‌రోవైపు వెబ్ సిరీస్‌లు , యాడ్స్, ఐటెం సాంగ్స్ ఇలా ఒక‌టేంటి నానా ర‌కాలుగా ర‌చ్చ చేస్తుంది. ఇక ప్రమోషనల్ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంది. తాజాగా సమంత పోస్ట్ చేసిన ప్రమోషనల్ వీడియో […]

 Authored By sandeep | The Telugu News | Updated on :9 March 2022,7:07 pm

Samantha : అక్కినేని మాజీ కోడ‌లు స‌మంత త‌గ్గేదే లే అంటుంది. ఒక‌ప్పుడు గ్లామ‌ర్ షో విష‌యంలో కాస్త ఆలోచించే స‌మంత ఇప్పుడు మాత్రం అడ్డంకులు అన్నింటిని ప‌క్క‌న పెట్టిన‌ట్టుగా క‌నిపిస్తుంది. స‌మంత ఒక‌వైపు వ‌రుస సినిమాలు చేస్తూనే మ‌రోవైపు వెబ్ సిరీస్‌లు , యాడ్స్, ఐటెం సాంగ్స్ ఇలా ఒక‌టేంటి నానా ర‌కాలుగా ర‌చ్చ చేస్తుంది. ఇక ప్రమోషనల్ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంది. తాజాగా సమంత పోస్ట్ చేసిన ప్రమోషనల్ వీడియో చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. తాజాగా త‌న సోష‌ల్ మీడియాలో బ్లెండర్స్ ప్రైడ్ కు సంబంధించిన ప్రమోషన్ వీడియో షేర్ చేయ‌గా, ఇందులో స్ట‌న్నింగ్ లుక్‌లో కనిపించింది

సమంత.సమంత ఇలా మద్యం ప్రకటనలో నటించడంపై కొంత మంది అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం క్వీన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే నిజానికి సమంత ఆ వైన్ బ్రాండ్ కోసం కాకుండా వారు నిర్వహించే షోల కోసం ప్రచారం చేస్తుంది. ఆ పేరు చూసి సమంత విస్కీని ప్రమోట్ చేస్తోందని చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు. దీంతో ఆమెను అపార్ధం చేసుకొని విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇక స‌మంత బిజినెస్ విషయంలోను ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు.ఇప్పటికే పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టింది.

samantha new looks stunning

samantha new looks stunning

Samantha : స‌మంత టూమచ్‌గా చేస్తుందిగా..

ఆమెకు సొంతంగా సాకీ అనే డిజైనరీ బ్రాండ్ కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా ఈ స్టార్టర్ ప్ లో కూడా భాగస్వామిగా చేరింది. ప్రస్తుతం ఆన్ లైన్ లో రన్ అవుతున్న ఈ కంపెనీ, త్వరలోనే వివిధ నగరాల్లో స్టోర్స్ కూడా ఏర్పాటుచేసే యోచనలో ఉంది. ఇందులో భాగంగా ఏప్రిల్ నాటికి మొదటి స్టోర్ లాంఛ్ చేయాలనుకుంటోంది. ఇక సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం యశోద సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది సమంత. ఆమె నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధమైంది. దీంతోపాటు మరో ద్విభాషా చిత్రంలో ఆమె నటించనుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది