Samantha : స‌మంత లీక్ చేసిందా.. కాబోయే భ‌ర్త ఇత‌నే అంటూ ప్ర‌చారాలు..!

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Published on: May 8, 2025, 6:00 pm
  •  Samantha : స‌మంత లీక్ చేసిందా.. కాబోయే భ‌ర్త ఇత‌నే అంటూ ప్ర‌చారాలు..!

Samantha : నాలుగేళ్ల క్రితం నాగచైతన్యతో విడిపోయి విడాకులు తీసుకున్నాక సమంత ఎవ‌రిని పెళ్లి చేసుకుంటుందా అనే ప్ర‌చారాలు జోరుగా సాగుతున్నాయి. అయితే కొంతకాలంగా దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వ్యాపించాయి. ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ రెండో సీజన్‌లో దర్శకుడు రాజ్‌తో సమంత కలిసి నటించారు.

Samantha : స‌మంత లీక్ చేసిందా.. కాబోయే భ‌ర్త ఇత‌నే అంటూ ప్ర‌చారాలు..!

Samantha : స‌మంత లీక్ చేసిందా.. కాబోయే భ‌ర్త ఇత‌నే అంటూ ప్ర‌చారాలు..!

Samantha నిజ‌మేనా ?

ఆ తర్వాత కూడా రాజ్, సమంత సన్నిహితంగా ఉండటంతో వారి మధ్య సంబంధం ఉందని, ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఊహాగానాలు వినిపించాయి. అయితే, దీనిపై ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. సామ్ ఇంతకు ముందు షేర్ చేసిన చెన్నై పికెల్ బాల్ టీమ్ లాంచ్, తిరుపతి సందర్శన ఫోటోల్లోనూ రాజ్ ఉన్నారు. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 తర్వాత సిటాడెల్ హనీ బన్నీలో సామ్ టైటిల్ రోల్ పోషించడం, రాజ్ అండ్ డీకే ప్రస్తుతం తీస్తున్న రక్త్ బ్రహ్మాండ్ లో మరో కీలకమైన క్యారెక్టర్ దక్కడం వెనుక కారణాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు.

తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌ లో కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను పంచుకున్నారు. దానికి కామెంట్‌గా “చాలా పెద్ద దారి దాటి బలంగా తయారయ్యాను.. ఇక కొత్త ప్రయాణం మొదలైంది..” అంటూ చివరిగా ‘శుభం’ సినిమా విడుదల తేదీని పేర్కొంటూ కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఇందులో దర్శకుడు రాజ్‌తో సమంత దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో, సమంత అతనితో దిగిన ఫోటోలను షేర్ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

Ramalingaiah Tandu

No bio available for this author.

  1. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  2. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  3. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  4. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  5. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  6. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  7. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp