Samantha : ఈ స‌మయంలో కూడా నిన్ను క‌చ్చితంగా చేరుకుంటా.. స‌మంత పోస్టు వైర‌ల్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : ఈ స‌మయంలో కూడా నిన్ను క‌చ్చితంగా చేరుకుంటా.. స‌మంత పోస్టు వైర‌ల్‌

Samantha స‌మంత టాపిక్ ఇప్పుడు ఎంత పాపుల‌రో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ భామ తన సోషల్‌ మీడియా అకౌంట్ ల‌లో త‌న పేరు ప‌క్క‌న ఉండే ‘అక్కినేని’ ప‌దాన్ని తీసేసిన‌ప్ప‌టి నుంచి రూమ‌ర్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈమెకు నాగచైతన్యకు మ‌ధ్య గొడ‌వ‌లు ఉన్నాయ‌ని వీరిద్ద‌రూ త్వ‌ర‌లోనే విడిపోతున్నారంటూ టాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. కాగా ఈ విష‌యంపై చైతన్య కానీ సమంత గానీ స్పందించ‌లేదు. కానీ వీరి మ్యాట‌ర్ హాట్ టాపిక్‌గా గానే ఉంటోంది. samantha […]

 Authored By mallesh | The Telugu News | Updated on :27 September 2021,5:00 pm

Samantha స‌మంత టాపిక్ ఇప్పుడు ఎంత పాపుల‌రో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ భామ తన సోషల్‌ మీడియా అకౌంట్ ల‌లో త‌న పేరు ప‌క్క‌న ఉండే ‘అక్కినేని’ ప‌దాన్ని తీసేసిన‌ప్ప‌టి నుంచి రూమ‌ర్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈమెకు నాగచైతన్యకు మ‌ధ్య గొడ‌వ‌లు ఉన్నాయ‌ని వీరిద్ద‌రూ త్వ‌ర‌లోనే విడిపోతున్నారంటూ టాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. కాగా ఈ విష‌యంపై చైతన్య కానీ సమంత గానీ స్పందించ‌లేదు. కానీ వీరి మ్యాట‌ర్ హాట్ టాపిక్‌గా గానే ఉంటోంది.

samantha New post viral

samantha New post viralమెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా సైతం ఈ ఇద్ద‌రిపై చాలా ర‌కాల వార్తలు వినిపిస్తోంది. చిన్నగా మొద‌లైన ఈ విష‌యం ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలోనే పెను సంచలనాలు క‌లిగిస్తోంది. కానీ అక్కినేని కుటుంబం మాత్రం ఎలాంటి క్లారిటీ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించ‌ట్లేదు. ఇక సమంత అయితే వీటి గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోన‌ట్టు చెన్నైలో జాలీగా ఎంజాయ్ చేస్తోంది. ఇక రీసెంట్ గా త్రిష, కీర్తి సురేశ్‌, కళ్యాణి ప్రియదర్శన్‌లతో స‌మంత దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టా లో షేర్ చేయ‌గా వెంట‌నే వైర‌ల్ అయిపోయింది.

Samantha

Samantha

Samantha తొలిరోజు 21కి.మీ. సైక్లింగ్‌…

ఇక ఇప్పుడు తాజాగా సమంత సైక్లింగ్ చేస్తున్న వీడియోను వ‌దిలింది. ఇందులో జోరుగా వ‌ర్షం ప‌డుతున్నా కూడా స్నేహితులతో కలిసి సైక్లింగ్ చేస్తోంది సామ్‌. అయితే దీనికి బెస్ట్‌ ఫ్రెండ్స్‌తో వర్షంలో సైక్లింగ్ ఎంతో మధురమంటూ తెలిపిన స‌మంత అందుకు త‌గ్గ‌ట్టే రాసుకొచ్చిది. ఇక తాను ఇప్ప‌టికే 21 కి.మీ. దూరం సైకిల్ తొక్కాన‌ని, జోరు వాన‌లో అయినా స‌రే 100 కిలో మీటర్ల గ‌మ్యాన్ని చేరుకుంటానంటూ చెప్ప‌డం విశేషం.

samantha chaitanya

samantha chaitanya

ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో స‌మంత షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఇంట‌ర్ నెట్‌ను షేక్ చేస్తోంద‌నే చెప్పాలి. కానీ దీన్ని చూసిన అక్కినేని అభిమాన‌లు మాత్రం త‌మ‌కు చైతూ విష‌యంలో క్లారిటీ కావాల‌ని కోరుతున్నారు. మ‌రి త్వ‌ర‌లో అయినా ఈ వివాదంపై క్లారిటీ వ‌స్తుందో లేదో చూడాలి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది