Samantha : యశోదాగా రాబోతున్న సమంత.. షూట్ ప్రారంభమైన పాన్ ఇండియా ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Samantha : యశోదాగా రాబోతున్న సమంత.. షూట్ ప్రారంభమైన పాన్ ఇండియా ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ..!

Samantha : టాలీవుడ్ యాపిల్ బ్యూటీ సమంత.. విడాకుల అనంతరం వ‌రుస సినిమాలకు సైన్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తోంది. ఫ్యామిలీ మెన్ వెబ్ సీరీస్ సీజన్ 2 తో పాన్ ఇండియా నటిగా గుర్తింపు పొందిన సమంత.. గుణ శేఖర్ దర్శకత్వంలో తాను నటిస్తోన్న శకుంతల సినిమాను ఇటీవలే పూర్తి చేసేసింది. డిఫరెంట్ సబ్జెక్ట్ తో ఇటీవలే ఓ హాలీవుడ్ సినిమానూ అనౌన్స్ చేసిన సామ్ తెలుగు, తమిళ్ బైలింగ్వేల్ గా తెరకెక్కనున్న సినిమాకు ముహూర్తం […]

 Authored By kranthi | The Telugu News | Updated on :6 December 2021,5:40 pm

Samantha : టాలీవుడ్ యాపిల్ బ్యూటీ సమంత.. విడాకుల అనంతరం వ‌రుస సినిమాలకు సైన్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తోంది. ఫ్యామిలీ మెన్ వెబ్ సీరీస్ సీజన్ 2 తో పాన్ ఇండియా నటిగా గుర్తింపు పొందిన సమంత.. గుణ శేఖర్ దర్శకత్వంలో తాను నటిస్తోన్న శకుంతల సినిమాను ఇటీవలే పూర్తి చేసేసింది. డిఫరెంట్ సబ్జెక్ట్ తో ఇటీవలే ఓ హాలీవుడ్ సినిమానూ అనౌన్స్ చేసిన సామ్ తెలుగు, తమిళ్ బైలింగ్వేల్ గా తెరకెక్కనున్న సినిమాకు ముహూర్తం పెట్టేసింది.సామ్ ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతకాంపై సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించే సినిమా నేటి నుంచి ప్రారంభమైంది. ఈ చిత్రానికి ‘యశోద’ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ.

. చిత్ర బృందం ఓ పోస్టర్ ను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సమంతాకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా.. ఈ చిత్రాన్ని… తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషలోనూ తెరకెక్కిస్తున్నట్లు తెలిపింది. ఈ పాన్ ఇండియా చిత్రానికి హరి-హరీష్ దర్శకత్వం వహించ నున్నారు.సమంతా ఇప్పటికే మహిళ ప్రాధాన్యత ఉన్న సినిమాగా తెరకెక్కుతోన్న శాకుంతలంలో నటిస్తుండగా.. తాజాగా యశోద మూవీలో కూడా అలాంటి పాత్రలోనే మెరవనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రం థ్రిల్లర్ జాన‌ర్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది.

samantha Pan india Yashoda movie Shooting start

samantha Pan india Yashoda movie Shooting start

Samantha పాన్ ఇండియా ఫీమేల్ ఓరియంటెడ్ మూవీలో సామ్

వచ్చే ఏడాది మార్చి నెల వరకు సినిమా షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి సమంత.. అక్కినేని ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి నాలుగేళ్ల తిరగకముందే బయటికొచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. విడాకులు అనంతరం సామ్ కానీ.. అక్కినేని కుటుంబం కానీ ఈ విషయంపై గురించి కానీ ఎక్కడా మాట్లాడటానికి ఇష్ట పడలేదు. విడాకుల కారణంగా సామ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుందేమో అనుకున్న అభిమానుల ఊహ గానాలకు చెక్ పెడుతూ బడా చిత్రాలకు వరుసగా సైన్ చేస్తూ తన దూకుడును కొనసాగిస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది