Samantha : విడాకుల త‌ర్వాత నాగ చైత‌న్య‌ గురించి పాజిటివ్‌గా మాట్లాడిన స‌మంత‌

Authored By Sam C | The Telugu News | Published on: February 8, 2022, 12:00 pm

Samantha : టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ నాగ చైత‌న్య‌- స‌మంత గ‌త ఏడాది అక్టోబ‌ర్ 2న విడాకులు తీసుకున్న విష‌యం తెలిసిందే. వీరు ఎందుకు విడాకులు తీసుకున్నార‌నే విష‌యం ఇప్ప‌టికీ హాట్ టాపిక్‌గానే మారింది. సమంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారంపై గత కొంతకాలంగా అటు సోషల్ మీడియాలో, ఇటు మీడియాలో ఎడ తెగని చర్చ జరుగుతోంది. సమంత, చై ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా గడుపుతుంటే… ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ ఈ జంట విడాకులపై రంధ్రాన్వేషణ చేస్తూనే ఉన్నారు. ఇకపోతే విడాకుల తర్వాత చైతూ గురించి ఎప్పుడు మాట్లాడని సామ్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాజీ భర్త క్యారెక్టర్ ని బయటపెట్టింది.

ఒకానొక సమయంలో నేను చైతన్యతో కలిసి షూటింగ్ చేసేటప్పుడు నా దగ్గర కనీసం అమ్మకు కాల్ చేసి మాట్లాడడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు అప్పుడు నా పరిస్థితిని అర్ధం చేసుకున్న చైతన్య.. వెంటనే నా దగ్గరకు వచ్చి తన ఫోన్ ఇచ్చి ఎంతసేపైనా మాట్లాడమని చెప్పాడు. చైతన్య పర్ఫెక్ట్ జెంటిల్ మ్యాన్.. ఫైన్షియల్ గా చైతూ తనను ఆదుకున్నాడని చెప్పుకొచ్చింది.ఇద్ద‌రి మ‌ధ్య ఎంతో అండ‌ర్‌స్టాండింగ్ ఉండేది. ఒక‌రికొక‌రు చూడ‌ముచ్చ‌ట‌గా ఉండేవారు. ఇలాంటి జంట విడిపోయారు అంటే నిజంగా ఆశ్చర్యమనే చెప్పాలి.ఇదిలా ఉంటే సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి విడాకుల ప్రకటనకు సంబంధించిన పోస్టును తొలగించడం ప‌లు చర్చల‌కు, సందేహాలకు తావిచ్చింది.

samantha positive comments on naga chaitanya

samantha positive comments on naga chaitanya

Samantha : స‌మంత పాజిటివ్ కామెంట్స్..

నాగచైతన్యతో విడిపోతున్నట్లు చేసిన ప్రకటనను సమంత తొలగించిందంటే… ఈ జంట మళ్లీ కలవబోతున్నారేమోనని ఫ్యాన్స్ సందేహాలు వెలిబుచ్చుతున్నారు. అయితే ఇన్‌స్టా నుంచి పోస్టును తొలగించినంత మాత్రాన సమంత-చైతన్య మళ్లీ కలవబోతున్నారనే నిర్దారణకు రావడమేంటని మరికొందరు ప్రశ్నించారు.నాగా చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికీ విడాకుల ప్రకటనకు సంబంధించిన పోస్టు అలాగే ఉంది. ఒకవేళ ఈ ఇద్దరూ మళ్లీ కలిసే ఛాన్స్ ఉంటే.. సమంత లాగే చైతన్య కూడా ఆ పోస్టును డిలీట్ చేసేవాడు కదా అనే సందేహం తలెత్తక మానదు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp