Samantha : నా ప‌నికి నువ్వు డ‌బ్బులు ఇవ్వ‌లేదు అంటూ ప్రీత‌మ్‌పై స‌మంత పోస్ట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : నా ప‌నికి నువ్వు డ‌బ్బులు ఇవ్వ‌లేదు అంటూ ప్రీత‌మ్‌పై స‌మంత పోస్ట్

Samantha : స‌మంత- నాగ చైత‌న్య విడాకుల త‌ర్వాత ప్రీత‌మ్ జుకాల్కర్ పేరు ఎక్కువ‌గా వినిపించింది. సమంత.. నాగచైతన్యకి విడాకులు ఇవ్వడానికి కారణం ఇతడే అంటూ ప్రీతమ్ జుకాల్కర్ ని పచ్చని సంసారంలో నిప్పులు పోశావంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేశారు. ఆ మ‌ధ్య ప్రీతమ్ జుకాల్కర్ తో తనకున్న బంధాన్ని వివరిస్తూ ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత. సోఫాలో కూర్చున్న ప్రీతమ్ జుకాల్కర్ పై కాళ్ళు వేసి పడుకున్న సమంత […]

 Authored By sandeep | The Telugu News | Updated on :25 March 2022,1:00 pm

Samantha : స‌మంత- నాగ చైత‌న్య విడాకుల త‌ర్వాత ప్రీత‌మ్ జుకాల్కర్ పేరు ఎక్కువ‌గా వినిపించింది. సమంత.. నాగచైతన్యకి విడాకులు ఇవ్వడానికి కారణం ఇతడే అంటూ ప్రీతమ్ జుకాల్కర్ ని పచ్చని సంసారంలో నిప్పులు పోశావంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేశారు. ఆ మ‌ధ్య ప్రీతమ్ జుకాల్కర్ తో తనకున్న బంధాన్ని వివరిస్తూ ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత. సోఫాలో కూర్చున్న ప్రీతమ్ జుకాల్కర్ పై కాళ్ళు వేసి పడుకున్న సమంత అతడితో సన్నిహితంగా ఉన్న ఫోటో అప్పట్లో హాట్ టాపిక్ గా మారడం.. ఆ పోస్ట్ చేసిన సమంతకి ప్రీతమ్ జుకాల్కర్ ఐ లవ్ యూ అంటూ రిప్లై ఇవ్వడం

వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది.వాటిపై ప్రీతమ్ స్పందిస్తూ తెగ బాధపడ్డాడు. తమ మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో నాగ చైతన్యకు తెలుసు.. ఇన్ని రకాల రూమర్లు వస్తున్నా కూడా చై ఖండించకపోవడం బాధగా ఉందంటూ ప్రీతమ్ ఎమోషనల్ అయ్యాడు. తాను సమంతను అక్కా అని సంబోధిస్తుంటాను, ఆ విషయం చైతన్యకు కూడా తెలుసంటూ క్లారిటీ ఇచ్చాడు. అయితే చాలా రోజుల త‌ర్వాత ప్రీత‌మ్ పేరు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ప్రీత‌మ్ కోసం స‌మంత హెయిర్ స్టైలిష్ట్‌గా మారింది. ప్రీతమ్ జుట్టును కట్ చేసేసింది. నాకు చాలా పనులు వచ్చు.. నేను మల్టీటాలెంటెడ్ అని సమంత తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.

samantha post on preetham

samantha post on preetham

Samantha : స‌మంత స్ట‌న్నింగ్ పోస్ట్..

ఇందులో ప్రీతమ్ జుట్టును కట్ చేసిన దృశ్యాలు కనిపించాయి. ఇక దాంతో పాటు ప్రీతమ్ మీద సమంత ఫన్నీగా స్పందించింది. నేను చేసిన పనికి నువ్ ఇంకా కూడా నాకు డబ్బులు చెల్లించలేదు అని హర్టైనట్టుగా, బాధపడుతున్నట్టుగా ఉన్న ఎమోజీని సమంత షేర్ చేసింది. ప్ర‌స్తుతం స‌మంత పోస్ట్ నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఇక ఇప్పుడు స‌మంత తెలుగు, త‌మిళంతో పాటు ప‌లు భాష‌ల‌లో న‌టిస్తుంది. శాకుంత‌లం షూటింగ్ పూర్తి చేసిన ఈ అమ్మ‌డు య‌శోద‌లో నటిస్తుంది. మ‌రి కొద్ది రోజుల‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా చేయ‌నుంద‌ని స‌మాచారం.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది