Samantha : సమంత ఒక్కసారి చెబితే వినవా.. వద్దంటే అదే చేస్తానంటావే.. ఆగలేకపోతున్నవా..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :21 February 2023,8:40 pm

Samantha : స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇటీవల మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సామ్ ఈ మధ్యనే కోలుకుంది. దీంతో వెంటనే అంతకుముందు సైన్ చేసిన సినిమాల షూటింగ్లో పాల్గొంటుంది. ఇక మనకు తెలిసిందే ఇటీవలే సమంత బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సీటాడెల్ సిరీస్లో సమంత నటిస్తుంది. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే దీనిని తెరకెక్కిస్తున్నారు. మొదటి షెడ్యూల్ ను ముంబైలో పూర్తి చేసుకోగా రెండవ షెడ్యూల్ కోసం ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ లో ప్లాన్ చేశారు.

Samantha practicing stunts for citadel series

Samantha practicing stunts for citadel series

ఈ క్రమంలోనే సమంత ఎముకలు కోరికే చలిలో స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తుంది. సిటాడెల్ సిరీస్ కి యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న యానిక్ బెన్ పర్యవేక్షణలో సీరియస్ గా శిక్షణ తీసుకుంటున్నారు. అంత చలిగా ఉన్న వాతావరణంలో ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో సమంత ఫ్యాన్స్ సామ్ డెడికేషన్ చూసి అభినందిస్తున్నారు. సమంత వృత్తిపట్ల ఎంత నిజాయితీగా ఉంటారో ఈ సంఘటనతో రుజువైంది. ప్రతికూల వాతావరణంలో తన పాత్ర కోసం సమంత సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. దీంతో సమంత గ్రేట్ అని పలువురు మెచ్చుకుంటున్నారు.

Samantha practicing stunts for citadel series

Samantha practicing stunts for citadel series

మయోసైటీస్ వ్యాధి బారిన పడిన సమంత కొన్నాళ్లకు షూటింగ్ కి విరామం ఇచ్చి విశ్రాంతి తీసుకున్నారు. ఆ వ్యాధి తగ్గు ముఖం పట్టిందో లేదో వెంటనే షూటింగ్లలో పాల్గొంటున్నారు. ఇటీవల శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రమోషన్స్ లో కూడా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఈ సినిమా ఎప్పుడు విడుదల చేస్తారో అధికారిక ప్రకటన అయితే ఇవ్వలేదు. ఇక ఖుషి సినిమా షూటింగ్ సమంత పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అనుకుంటా. ప్రస్తుతం సమంత హిందీ వెబ్ సిరీస్ లో యాక్టివ్గా పాల్గొంటుంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి