Samantha : స‌మంత ఖాతాలో మ‌రో కొత్త బ్రాండ్.. ఎద అందాలు ఆర‌బోస్తూ తెగ ప్ర‌చారం చేస్తుందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : స‌మంత ఖాతాలో మ‌రో కొత్త బ్రాండ్.. ఎద అందాలు ఆర‌బోస్తూ తెగ ప్ర‌చారం చేస్తుందిగా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :25 January 2022,9:36 pm

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత విడాకుల త‌ర్వాత చాలా స్పీడ్ అయింది. ఒక వైపు సినిమాలు మ‌రో వైపు సోష‌ల్ మీడియా, ఇంకోవైపు బిజినెస్‌ల ద్వారా రెండు చేతులా సంపాదిస్తుంది. ఇప్పుడు క్రిప్టో యాప్‌కి ప్ర‌చార‌క‌ర్త‌గా మారింది. ఇందులో చిన్న‌చిన్న‌గా పెట్టుబ‌డులు పెట్టి భారీగా లాభాలు సంపాదించొచ్చ‌ని చెబుతుంది. గతేడాది 2021లో క్రిప్టోకరెన్సీలో విపరీతంగా పెట్టుబడులు పెట్టారు. 2022లో కూడా క్రిప్టోకరెన్సీలో గట్టిగా పెట్టుబడులు ఉండొచ్చని ఊహించారు. అయితే, గత వారం రోజులుగా క్రిప్టోకరెన్సీల ధరలు భారీగా క్షీణిస్తున్నాయి. దీని కారణంగా క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాప్ రూ.75లక్షల కోట్లు తగ్గింది.

స‌మంత మాత్రం క్రిప్టో యాప్ ద్వారా బిట్ కాయిన్ కొని అమ్ముకొని మంచి లాభాలు పొందొచ్చ‌ని చెబుతుంది. జిమ్‌లో వ‌ర్క‌వుట్ చేస్తూ స‌మంత చేస్తున్న ప్ర‌చారం ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ త‌న అందాలు ఆరబోస్తూ ఇంత‌లా ప్ర‌చారం చేయ‌డం చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. పాన్‌ ఇండియా స్టార్‌ ఇమేజ్‌ని మించి గ్లోబల్‌ ఇమేజ్‌ దిశగా అడుగులు వేస్తున్న స‌మంత తన బిజినెస్‌ని కూడా విస్తరిస్తుంది . వ్యాపార పరంగానూ దూసుకుపోతుంది. రెండేళ్ల క్రితం స‌మంత‌.. తన ఫ్రెండ్‌ సుశృతి క్రిష్ణతో కలిసి `సాకీ` పేరుతో ఉమెన్స్ వేర్‌ని ప్రారంభించింది. ఫ్యాషన్‌ రంగంలో తనదైన స్పెషాలిటీతో ఈ సాకీని క్లాత్స్ వేర్‌ని ప్రారంభించింది.

samantha promote for crypto app

samantha promote for crypto app

Samantha : స‌మంత ప్లానింగ్స్ మాములుగా లేవు..

తన ప్రొడక్ట్ లకు తనే బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారి ప్రమోట్‌ చేసింది సమంత. కరోనా మొదటి లాక్‌డౌన్‌ సమయంలో ఆమె పూర్తిగా ఈ బిజినెస్‌ పైనే దృష్టిపెట్టింది. అయితే రెండేళ్ల తర్వాత దీన్ని విస్తరించబోతుంది. అప్పుడు టీనేజ్‌, అడల్ట్స్, ఉమెన్స్ కి ఉండగా, ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా విస్తరిస్తుంది. `సాకీ` బ్రాండ్‌లో భాగంగా `సాకీ గర్ల్స్` పేరుతో కిడ్స్ వేర్‌ని లాంచ్‌ చేయబోతుంది. రెండేళ్ల నుంచి 8ఏళ్ల వరకు గర్ల్స్ కి ఈ కిడ్స్ వేర్‌ని ప్రారంభించబోతున్నారు. ఇందులో అన్ని రకాల మోడల్స్ ని అందుబాటులో ఉంచబోతున్నారు. ఈ విషయాన్ని సమంతతోపాటు సాకీ ఫౌండర్‌ సీఈవో సుశృతి క్రిష్ణ రీసెంట్‌గా ప్ర‌క‌టించారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది