Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేస్తుంది అనే వార్త బయటకు రాగా, ఒక్కసారిగా సినీ ప్రేక్షకులు అంతా ఉలిక్కిపడ్డారు. సమంత అంటే ఐటెం సాంగ్ చేయడమేంటని అందరు ఆశ్చర్యపోయారు. కాని అదే నిజమైంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేయగా, కెరీర్‌లోనే తొలిసారిగా సమంత స్పెషల్ సాంగ్ చేస్తుండటంతో మరింత ఆసక్తి పెరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాలుగురోజుల పాటు ఈ సాంగ్ షూటింగ్ జరిగినట్టు సమాచారం. అయితే ఈ సాంగ్‌కిగాను సమంత కోటిన్నర రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు మొన్నటి వరకు ప్రచారం సాగింది.
స్పెషల్ సాంగ్‌లో ‘’ఊ.. అంటావా మావా.. ఊఊ అంటావా’ పాటతో ఓ ఊపు ఊపేసింది సమంత. ఈ సాంగ్ ఎంత వివాదమయ్యిందో..సమంతపై అంతకంటే ఎక్కువ ప్రశంసలు వచ్చాయి. కృతి సనన్, సంజీదా షేక్ వంటి నటీనటులు సామ్ ను ప్రశంసించారు. అయితే దీని అంతటి కారణం బన్నీనే కారణమని ఓ నివేదిక వెల్లడించింది. బన్నీపై ఉన్న సమ్మకం వలనే సమంత ఈ సాంగ్ లో డ్యాన్స్ చేసిందంటూ ఇటీవల కూడా వార్తలు వచ్చాయి. అయితే దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ సాంగ్ అప్ లోడ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది
ఈ సాంగ్‌తో సమంత వరల్డ్ వైడ్ పాపులారిటీని సంపాదించుకుంది.బాలీవుడ్ మీడియా సమాచారం మేరకు సమంత ఐదు కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది. బాబోయ్ స్పెషల్ సాంగ్ కోసం సమంత అంత రెమ్యునరేషన్ అందుకుందా అంటూ ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఈ పాటకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా ఇంద్రవతి చౌహాన్ ఆలపించారు. కాగా అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప చిత్రం డిసెంబర్ 17న విడుదలైంది. పాన్ ఇండియా చిత్రంగా రిలీజైన ఈ మూవీ ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం సామ్.. నయనతార, విజయ్ సేతుపతితో కలిసి’కత్తువాకుల రెండు కాదల్’ చిత్రంలోనూ, తన తొలి అంతర్జాతీయ చిత్రం ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’లోనూ నటిస్తోంది.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.