Samantha : ఐటెం సాంగ్ కోసం స‌మంత కోటిన్న‌ర కాదు ఏకంగా ఐదు కోట్లు తీసుకుంద‌ట‌…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Samantha : ఐటెం సాంగ్ కోసం స‌మంత కోటిన్న‌ర కాదు ఏకంగా ఐదు కోట్లు తీసుకుంద‌ట‌…!

Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేస్తుంది అనే వార్త బ‌య‌ట‌కు రాగా, ఒక్క‌సారిగా సినీ ప్రేక్ష‌కులు అంతా ఉలిక్కిప‌డ్డారు. స‌మంత అంటే ఐటెం సాంగ్ చేయ‌డ‌మేంట‌ని అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయారు. కాని అదే నిజ‌మైంది. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో సమంత స్పెషల్‌ సాంగ్ చేయ‌గా, కెరీర్‌లోనే తొలిసారిగా సమంత స్పెషల్‌ సాంగ్‌ చేస్తుండటంతో మరింత ఆసక్తి పెరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాలుగురోజుల పాటు ఈ సాంగ్‌ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :17 January 2022,5:30 pm

Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేస్తుంది అనే వార్త బ‌య‌ట‌కు రాగా, ఒక్క‌సారిగా సినీ ప్రేక్ష‌కులు అంతా ఉలిక్కిప‌డ్డారు. స‌మంత అంటే ఐటెం సాంగ్ చేయ‌డ‌మేంట‌ని అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయారు. కాని అదే నిజ‌మైంది. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో సమంత స్పెషల్‌ సాంగ్ చేయ‌గా, కెరీర్‌లోనే తొలిసారిగా సమంత స్పెషల్‌ సాంగ్‌ చేస్తుండటంతో మరింత ఆసక్తి పెరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాలుగురోజుల పాటు ఈ సాంగ్‌ షూటింగ్ జ‌రిగిన‌ట్టు స‌మాచారం. అయితే ఈ సాంగ్‌కిగాను సమంత కోటిన్నర రూపాయల రెమ్యునరేషన్‌ తీసుకున్న‌ట్టు మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌చారం సాగింది.

స్పెష‌ల్ సాంగ్‌లో ‘’ఊ.. అంటావా మావా.. ఊఊ అంటావా’ పాటతో ఓ ఊపు ఊపేసింది సమంత. ఈ సాంగ్ ఎంత వివాదమయ్యిందో..సమంతపై అంతకంటే ఎక్కువ ప్రశంసలు వచ్చాయి. కృతి సనన్, సంజీదా షేక్ వంటి నటీనటులు సామ్ ను ప్రశంసించారు. అయితే దీని అంతటి కారణం బన్నీనే కారణమని ఓ నివేదిక వెల్లడించింది. బ‌న్నీపై ఉన్న స‌మ్మ‌కం వ‌ల‌నే స‌మంత ఈ సాంగ్ లో డ్యాన్స్ చేసిందంటూ ఇటీవ‌ల కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ సాంగ్ అప్ లోడ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది

samantha Pushpa Item Song remuneration topic now

samantha Pushpa Item Song remuneration topic now

Samantha : భారీగా రెమ్యున‌రేష‌న్‌..

ఈ సాంగ్‌తో సమంత వరల్డ్ వైడ్ పాపులారిటీని సంపాదించుకుంది.బాలీవుడ్ మీడియా స‌మాచారం మేర‌కు స‌మంత ఐదు కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుకున్న‌ట్టు తెలుస్తుంది. బాబోయ్ స్పెష‌ల్ సాంగ్ కోసం స‌మంత అంత రెమ్యున‌రేష‌న్ అందుకుందా అంటూ ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఈ పాట‌కు దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించ‌గా ఇంద్ర‌వ‌తి చౌహాన్ ఆల‌పించారు. కాగా అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన పుష్ప చిత్రం డిసెంబ‌ర్ 17న విడుద‌లైంది. పాన్ ఇండియా చిత్రంగా రిలీజైన ఈ మూవీ ఇప్ప‌టివ‌ర‌కు రూ.300 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించింది. ప్రస్తుతం సామ్.. నయనతార, విజయ్ సేతుపతితో కలిసి’కత్తువాకుల రెండు కాదల్’ చిత్రంలోనూ, తన తొలి అంతర్జాతీయ చిత్రం ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’లోనూ నటిస్తోంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది