Samantha Quotes About Goodness And Beauty
Samantha : సమంత ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాను మాత్రం వదలదు. నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తనలోని భావాలను, తాను చెప్పదలుచుకున్న విషయాలను ఇలా ఏదో ఒక కొటేషన్ రూపంలో షేర్ చేస్తుంటుంది. గత ఏడాది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలోనూ ఇలా పరోక్షంగా ఏవేవో కొటేషన్లు షేర్ చేస్తూ వచ్చేది. ప్రేమ, మోసం అంటూ రకరకాల కొటేషన్లను షేర్ చేసింది. వాటిని సమంత మూడ్ ఏంటో అర్థమయ్యేది.
అసలు సమంత చెప్పదలుచుకున్న సంగతులేంటో తెలిసేది. అయితే సమంత విడాకుల అనంతరం మాత్రం ఎదుటి వాళ్లకు గట్టిగా గుచ్చుకునేలా సెటైర్లు వేసేలా కొటేషన్లు షేర్ చేస్తూ ఉండేది. తాజాగా మరో కొటేషన్ షేర్ చేసింది. ఇందులో సమంత తనది తాను మంచిదాన్ని అని చెప్పుకున్నట్టుగా ఉంది. మనం ఎదుటివారిలో మంచిదనాన్ని ఎందుకు చూస్తామంటే.. మనలో మంచిదనం ఉంది కాబట్టి అంటూ ఓ ఆంగ్ల కొటేషన్‌ను షేర్ చేసింది.
Samantha Quotes About Goodness And Beauty
దీన్ని బట్టి సమంత తనలో మంచితనం ఉంది కాబట్టే.. ఎదుటివారిలోని మంచిని గుర్తిస్తున్నాను అని చెప్పినట్టుగా ఉంది. మొత్తానికి సమంత కొటేషన్లు మాత్రం ఓ పట్టాన అంతు పట్టవు. ఎప్పుడు ఎందుకు ఎలాంటి కొటేషన్లు పెడుతుందో చెప్పలేం. ఇక సమంత ప్రస్తుతం శాకుంతలం, యశోద, ఖుషి వంటి సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇక బాలీవుడ్ ప్రాజెక్ట్ అయితే ఇంత వరకు ఓకే కాలేదు. వాటికోసమే సమంత తెగ ప్రయత్నాలు చేస్తోంది.
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
This website uses cookies.