Samantha : నేను తప్పు చేయలేదు .. చైతూతో పెళ్ళికి 100 శాతం న్యాయం చేశా .. విడాకులకు కారణం అదే .. ?

Authored By Sudheer Ramanujam | The Telugu News | Updated on : 20 April 2026, 4:30 pm
  •  Samantha : నేను తప్పు చేయలేదు .. చైతూతో పెళ్ళికి 100 శాతం న్యాయం చేశా .. విడాకులకు కారణం అదే .. ?

Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్‌లో ఒకప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేశావే సినిమా సమయంలో మొదలైన పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలం డేటింగ్ చేసిన ఈ జంట కుటుంబ సభ్యుల సమ్మతితో 2017 అక్టోబర్ 6, 7 తేదీల్లో గోవాలో ఘనంగా వివాహం చేసుకున్నారు. హిందూ, క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ పెళ్లి అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెళ్లి అనంతరం హైదరాబాద్‌లో తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభించిన ఈ జంట సోషల్ మీడియాలో కలిసి గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకునేవారు. షాపింగ్, కిచెన్ మూమెంట్స్, ట్రావెల్స్ వంటి ఫోటోలు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. వీరి అనుబంధం చాలామందికి ఆదర్శంగా కనిపించింది.

Samantha responds to divorce from Naga Chaitanya

Samantha responds to divorce from Naga Chaitanya

Samantha : విడాకుల దారి .. ఇంకా ముగియని చర్చ

అయితే అనూహ్యంగా ఈ జంట మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. సమంత తన సోషల్ మీడియాలో అక్కినేని ఇంటిపేరును తొలగించడం నాగచైతన్యను అన్‌ఫాలో చేయడం కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేయడం వంటి చర్యలు అప్పట్లో చర్చకు దారితీశాయి. చివరికి 2021లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్ల వైవాహిక జీవితం అక్కడితో ముగిసింది. ఈ విడాకులకు కారణాలు ఏమిటన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. కానీ మీడియాలో మాత్రం అనేక వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. దాదాపు ఐదేళ్లు గడుస్తున్నా ఈ అంశం ఇంకా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా ఉండటం విశేషం.

Samantha : కొత్త జీవితాలు .. సమంత స్పందన వైరల్

విడాకుల తర్వాత ఇద్దరూ తమ తమ జీవితాల్లో ముందుకు సాగారు. నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నారు. మరోవైపు సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించారు. ఈ క్రమంలో సమంత మయోసైటిస్ అనే వ్యాధిని జయించి తిరిగి కెరీర్‌పై దృష్టి పెట్టారు. అయితే విడాకుల తర్వాత ఆమె చేసిన నిర్ణయాలు, ముఖ్యంగా పుష్ప: ది రైజ్లో చేసిన “ఊ అంటావా మావా” పాటపై విపరీతమైన చర్చ జరిగింది. ఈ పాటలో అల్లు అర్జున్ డ్యాన్స్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌తో పాటు సమంత గ్లామర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ..“విడాకుల సమయంలో నాకు ఈ పాట చేయొద్దని కుటుంబ సభ్యులు సూచించారు. కానీ నేను తప్పు చేయలేదు. నా పెళ్లికి 100 శాతం న్యాయం చేశాను. అది వర్కవుట్ కాలేదు అంతే. ఇంట్లో కూర్చోమన్నారు. కానీ నేను ఏ తప్పూ చేయలేదు కాబట్టి నా పని చేసాను” అని వెల్లడించారు.
ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మరోసారి నాగచైతన్య–సమంత విడాకుల అంశం చర్చనీయాంశమైంది.

 

Advertisement

Sudheer Ramanujam

Sudheer Ramanujam Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి