Home » Entertainment » Samantha Said Ok For Marriage
Entertainment

Samantha : త‌ల్లిదండ్రుల ఫోర్స్‌తో రెండో పెళ్లికి ఓకే అన్న స‌మంత‌..!

Authored By
Sam C
The Telugu News | Published on: April 22, 2022, 6:30 pm
Advertisement

Samantha: చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ర్షించే అభిన‌యంతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన స‌మంత త‌ను ప్రేమించిన వ్య‌క్తి నుండి విడిపోయిన విష‌యం తెలిసిందే. ఇక అప్ప‌టి నుండి సోషల్ మీడియాలో నిత్యం గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తుంది. సమంత ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక అప్పుడప్పుడు అభిమానులు అడిగే ప్రశ్నలకు కూడా ఆమె చాలా స్వీట్ గా సమాధానం చెబుతూ ఉంటారు.

Advertisement

ఆమె చేతిలో రెండు పాన్ ఇండియన్ సినిమాలతో పాటు విజయ్ దేవరకొండ తో కూడా కొత్త సినిమా చేస్తోంది సమంత.తమిళ్ హీరో విజయ సేతుపతి, నయనతార తో చేసిన కాతు వాకుల రెండు కాదల్’ మూవీ కూడా త్వరలోనే రిలీజ్ కానుంది.తెలుగులో యశోద మరియు శాకుంతలం వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.ఇక గత ఏడాది ఫామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో OTT లోకి కూడా అడుగుపెట్టిన సమంత, ఇప్పుడు మరికొన్ని వెబ్ సిరీస్ లకు కూడా సంతకాలు చేసింది.

samantha said ok for marriage

Advertisement

Samantha : స‌మంత సై అందా..

కెరీర్ లో సమంత ఇంత బిజీగా ఉండ‌గా, త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్కేందుకు సిద్ద‌మైంద‌ట‌.ఇంట్లో వాళ్లు రెండో పెళ్లి చేసుకోమని గత కొద్దీ రోజుల నుండి తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నారని సమాచారం. పెళ్లి అయ్యి విడాకులు అయ్యినంత మాత్రాన జీవితం అక్కడే ఆగిపోకూడదు అని సమంత తల్లి తండ్రులు ఆమెకు సర్ది చెబుతున్నారట. తన గురించి తన తల్లిదండ్రులు పడుతున్న బాధ చూడలేక.. కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పిందట సామ్. కానీ ప్రస్తుతానికి తాను సినిమాలపైనే దృష్టి పెడతానని… చెప్పింది. రెండో పెళ్లికి కాస్త సమయం కావాలని సమంత ఇంట్లోవాళ్లను కోరిందని స‌మాచారం.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి