Samantha : నీ గురించి నాకు మొత్తం తెలుసు… ఆ విషయంపై ఓపెన్ అయిన సమంత..!
Samantha : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యకు డైవోర్స్ ఇచ్చిన తర్వాత సమంత Samantha ..తన ప్రొఫెషనల్ కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టేసింది. ఫ్రెండ్స్‌తో హ్యాపీగా గడిపేస్తూ మునుపటి మాదిరిగానే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా చిన్మయి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.సమంతకు టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. కాగా, ఆమెకు ఉన్న థిక్కెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకరు చిన్మయి.
ఫ్రెండ్ షిప్ అంటే ప్రాణం ఇచ్చే సమంత.. చిన్మయితో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ క్రమంలోనే చిన్మయి బిజినెస్ ఐడియాస్‌కు సమంత సపోర్ట్ ఇచ్చింది. సమంత Samantha వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగా చిన్మయి శ్రీపాద ఉన్న సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. ఇకపోతే మహిళా శక్తికి సంబంధించి చిన్మయి శ్రీపాద తన వాయిస్ వినిపిస్తున్న క్రమంలోనే సమంత, చిన్మయి ఇంకా క్లోజ్ అయ్యారని చెప్పొచ్చు.

samantha interesting post in instagram
Samantha : స్టామినా గురించి ఇన్ స్టా వేదికగా సమంత పోస్టు..
ఈ సంగతులు అలా ఉంచితే చిన్మయి స్పా, బ్యూటి సెంటర్ ‘డీప్ స్కిన్ డైలాగ్స్’ పేరిట స్టార్ట్ చేసింది. దీనిని సమంత తన చేతుల మీదుగా ఓపెన్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన పోస్టును సమంత ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది. తనకు చిన్మయి స్టామినా గురించి బిజినెస్‌పైన చిన్మయికి ఉన్న ప్యాషన్ గురించి తనకు తెలుసని ఇన్ స్టా పోస్టులో సమంత పేర్కొంది. చెన్నైల్ చిన్మయి స్టార్ట్ చేసిన మెడి స్పా.. సౌత్ ఏసియాలోనే తొలి హాలీవుడ్ స్కల్పింగ్ సెంటర్ అని సమంత తెలిపింది.
చిన్మయి వేసిన అడుగు తనను సక్సెస్ వైపునకు తీసుకెళ్లాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు సమంత పేర్కొంది. ఇకపోతే సమంత Samantha ‘శాకుంతలం, కాతు వాకుల రెండు కాదల్’ చిత్రాల షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రజెంట్.. బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌పైన దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో స్పెషల్ సాంగ్‌లో కనిపించేందుకుగాను సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.