Samantha : స‌మంత ధ‌రించిన ఈ చీర ధ‌ర తెలిస్తే ఉలిక్కిప‌డ‌డం ఖాయం..!

Authored By Sam C | The Telugu News | Updated on : 28 February 2022, 12:30 pm

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత పేరు ఇటీవ‌లి కాలంలో నిత్యం ట్రెండింగ్‌లో ఉంటుంది. ఈ అమ్మ‌డు సినిమాలు, విహార యాత్ర‌లు, సోష‌ల్ మీడియా ఫొటోల‌తో నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. టాప్ హీరోయిన్‌గా అద‌ర‌గొడుతున్న స‌మంత “పుష్ప : ది రైజ్‌” సాంగ్ లో చివరిసారిగా కనిపించింది. మ‌రోవైపు సమంత పలు భారీ బడ్జెట్ చిత్రాలను లైన్ లో పెట్టింది. వాటిలో “యశోద” కూడా ఒకటి. సమంత హీరోయిన్ గా మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ హరి, హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తారని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు.

ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.సమంత తెలుగులో ‘ఏమాయ చేశావే’ సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక చైతూ నుండి విడిపోయిన‌ప్ప‌టి నుండి స‌మంత త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఆస‌క్తిక‌ర పోస్ట్‌లు షేర్ చేస్తూనే ఉంది.

samantha saree cost surprising the audience

samantha saree cost surprising the audience

Samantha : స‌మంత టూ కాస్ట్‌లీ గురు..

రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘త్వరలో ఓ మంచి జరగనుంది.. గుర్తుంచుకోండి..’ అంటూ ఓ కోట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈమె తెలుగు రంగు పట్టుచీర ధరించి అభిమానులకు కనువిందు చేసింది. ఆ చీరపై ఎంబ్రాడరీ ఉంది. దానికి తగ్గట్టు మ్యాచింగ్ జ్యువలరీ ధరించింది. ఈ చీరను చూసిన అభిమానులు.. అది ఎంతో తెలుసుకోవడానికి గూగుల్‌ను వెతికేసారు. ఇంతకీ సామ్ ధరించిన చీర ధర అక్షరాల రూ. 1 లక్షల 15 వేలు అని తేలింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు.. అవాక్కయ్యారు. సామ్.. తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా మంచి డిమాండ్‌లో ఉంది. ఆమె రేంజ్‌కు ఈ లక్ష చీర కూడా తక్కువే అంటున్నారు అభిమానులు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి