Samantha : సమంత చెప్పడంతోనే అలా చేశాం.. నోరు విప్పిన నిర్మాత | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : సమంత చెప్పడంతోనే అలా చేశాం.. నోరు విప్పిన నిర్మాత

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత ప్ర‌స్తుతం లేడి ఓరియెంటెడ్ సినిమాలే ఎక్కువ‌గా చేస్తుంది. ఆమె న‌టించిన శాకుంత‌లం చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. అయితే ఈ సినిమా నిర్మాత నీలిమ గుణ ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో స‌మంత గురించి ఆస‌క్తిక‌ర విషయాలు తెలియ‌జేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఆ మధ్య చై సామ్ విడాకులపై స్పందించింది. సమంత పిల్లల్ని కనేందుకు అంతా సిద్ధం చేసుకుంది కానీ ఆగస్టులో ఏదో జరిగి విడాకులు తీసుకున్నారు. “శాకుంతలం సినిమా […]

 Authored By sandeep | The Telugu News | Updated on :1 March 2022,2:00 pm

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత ప్ర‌స్తుతం లేడి ఓరియెంటెడ్ సినిమాలే ఎక్కువ‌గా చేస్తుంది. ఆమె న‌టించిన శాకుంత‌లం చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. అయితే ఈ సినిమా నిర్మాత నీలిమ గుణ ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో స‌మంత గురించి ఆస‌క్తిక‌ర విషయాలు తెలియ‌జేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఆ మధ్య చై సామ్ విడాకులపై స్పందించింది. సమంత పిల్లల్ని కనేందుకు అంతా సిద్ధం చేసుకుంది కానీ ఆగస్టులో ఏదో జరిగి విడాకులు తీసుకున్నారు. “శాకుంతలం సినిమా కోసం మా నాన్న (దర్శకుడు గుణశేఖర్) సమంత ని సంప్రదించారు. అప్పటికే ఆమె సినిమాలు చేయకూడదని ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉన్నానని అందుకే సినిమా చేయనని చెప్పారు.

కథ నచ్చడంతో ఓకే చెప్పారు ఆగస్టు కల్లా షూటింగ్ పూర్తి చేయాలని ఆమె కోరారు. మేము కూడా షూటింగ్ అలానే ప్లాన్ చేసాము. సమంతా సినిమాలకి విరామం ఇచ్చి పిల్లల్ని కనేందుకే ప్రాధాన్యత ఇచ్చారు అని ఆ మ‌ధ్య నీలిమ గుణ చెప్పుకొచ్చింది. ఇక తాజా ఇంట‌ర్వ్యూలో స‌మంత మ‌హిళ‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని కోరింద‌ని ఆమె చెప్పిన‌ట్టు మేం చేశామ‌ని అన్నారు. సినిమా స్టార్ట్ చేయ‌క ముందు స‌మంత చిత్రం కోసం ఎక్కువ మంది మహిళ‌ల‌ను తీసుకోవాల‌ని కోరింది. ఆమె ఆలోచ‌న మాకు కూడాబాగా న‌చ్చింది.స‌మంత చెప్పిన‌ట్టుగానే సినిమా కోసం ఎక్కువ మంది టెక్నీషియ‌న్స్‌ని తీసుకున్నాం. శాకుతలం కోసం చాలా మంది మ‌హిళ‌లే ప‌ని చేశారు అంటూ నీలిమ రీసెంట్‌గా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది.

samantha says girl power to stunning post

samantha says girl power to stunning post

Samantha : గార్ల్ ప‌వ‌ర్ అంటూ స‌మంత పోస్ట్

అయితే నీలిమ ఇంట‌ర్వ్యూ పేప‌ర్ క‌టింగ్‌ని స‌మంత త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. గార్ల్ ప‌వర్ అని కామెంట్ పెట్టింది. గుణశేఖర్‌ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్యాన్ ఇండియన్ చిత్రం మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల దుష్యంత మహారాజు ప్రేమ కథ ఆధారంగా రూపొందుతోంది. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్‌ మోహన్‌ నటించారు. ఇక ఈ సినిమాలో మరో విశేషం ఏమంటే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేయనున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది