Samantha : అప్పుడు చైతూతో నా ఫస్ట్ మూవీ ఏమాయ చేశావే గుర్తొచ్చింది.. ఎమోషనల్ అయిన సమంత?
Samantha : సమంత రుతుప్రభు.. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నాక.. తనకు ఆఫర్లు రావు అని అందరూ అనుకున్నారు. సమంత చాలా పెద్ద తప్పు చేసింది. నాగ చైతన్యను వదిలేయడం వల్ల.. తన సినిమా కెరీర్ ను కోల్పోవాల్సి వస్తుంది. తనకు ఇక ఆఫర్లు కష్టం అని సినీ ఇండస్ట్రీ మొత్తం కోడై కూసింది. కానీ.. తనకు విడాకుల తర్వాతే ఆఫర్లు వరుసకడుతున్నాయి. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచే కాదు.. బాలీవుడ్, హాలీవుడ్ నుంచి కూడా తనకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికే తెలుగు, తమిళం భాషల్లో కొన్ని సినిమాలు చేస్తున్న సామ్..
ఏకంగా హాలీవుడ్ సినిమా కూడా ఓకే చెప్పేసింది. తొలిసారి సమంత ఓ హాలీవుడ్ మూవీలో నటించబోతోంది. ఆ సినిమా పేరు.. అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్. ఆ సినిమాకు ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించనున్నాడు.సమంత.. మొదటిసారి.. ఏమాయ చేశావే సినిమా కోసం ఆడిషన్స్ లో పాల్గొంది. అది 2009 వ సంవత్సరం. ఏమాయ చేశావే సినిమా కోసం ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఇఫ్పటి వరకు మళ్లీ ఏ సినిమా కోసం కూడా ఆడిషన్స్ ఇవ్వలేదు సమంత.

samantha says she reminded ye maya chesave movie with naga chaitanya
Samantha : 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఆడిషన్స్ లో పాల్గొన్నా
కానీ మరోసారి.. అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ సినిమా కోసం ఆడిషన్ లో పాల్గొనాల్సి వచ్చిందని చెప్పింది. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఆడిషన్స్ లో పాల్గొన్నా. సరికొత్త వరల్డ్ లోకి అడుగుపెట్టబోతున్నా. మళ్లీ ఆడిషన్ కు వెళ్లా. 2009 లో ఏమాయ చేశావే సినిమాకు ఆడిషన్ చేసినప్పుడు ఎలా భయపడ్డానో.. ఇప్పుడు కూడా అదే భయం నన్ను వెంటాడింది.. అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది సమంత.
ఇక.. అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ అనే సినిమా సమంత.. మరో వివాదాస్పద పాత్రలో నటించబోతోంది. పురుషులతో పాటు.. స్త్రీలతోనూ ప్రేమలో పడే పాత్ర అది. ఆ పాత్రలో సమంత ఎలా నటిస్తుందో వేచి చూడాలి. ఇప్పటికే.. సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 లో బోల్డ్ గా నటించి.. విమర్శల పాలు అయిన విషయం తెలిసిందే.