Samantha : సమంతకు తాళి కట్టిన స్టార్ హీరో .. షాక్ లో ఫ్యాన్స్ ..!!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: March 12, 2023, 9:40 am

Samantha : ప్రస్తుతం టాలీవుడ్ బ్యూటీ సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. మొదట నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా ఇద్దరు విడిపోయి ఎవరి లైఫ్ వారు బ్రతుకుతున్నారు. ఈ క్రమంలోనే సమంత రెండో పెళ్లి చేసుకుందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం సమంత పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతుంది.

Samantha second marriage news viral

Samantha second marriage news viral

ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘ ఖుషి ‘ సినిమా షూటింగ్లో పాల్గొంటుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా సమంత నటిస్తుంది. అయితే ఇదివరకే ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలోనే సెకండ్ షెడ్యూల్లో భాగంగా విజయ్ దేవరకొండ సమంతల మధ్య కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ను షూట్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ సమంత కు సంబంధించిన పెళ్లి సీన్స్ ను షూట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీళ్ళిద్దరూ ఈ సినిమాలో భార్యాభర్తలుగా కనిపించబోతున్నట్లు సమాచారం.

Samantha takes up a spiritual journey!

అయితే డైరెక్టర్ శివ నిర్వాణ నిజంగానే సమంత మెడలో విజయ్ దేవరకొండ చేత మూడు ముళ్లు వేయించారట. దీంతో సెట్స్ లో సమంత మెడలో తాళి చూసి అందరు సమంతకు రెండో పెళ్లి అయిందని అనుకున్నారట. దీంతో అందరు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారట. ఇక సమంత కేవలం తెలుగులోనే కాకుండా హిందీ సినిమాలలో కూడా నటిస్తుంది. హిందీలో సీటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. మొత్తానికి సమంత పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి బాగా కష్టపడుతుంది అని తెలుస్తుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp