Samantha : స‌మంత నోటి నుండి విడాకుల విష‌యాలు రాబ‌ట్ట‌బోతున్నాడా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : స‌మంత నోటి నుండి విడాకుల విష‌యాలు రాబ‌ట్ట‌బోతున్నాడా..!

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. చూడ‌చ‌క్క‌ని అందం, ఆకట్టుకునే అభిన‌యం ముద్దుగుమ్మ సొంతం.ఇటీవ‌ల స‌మంత రేంజ్ మాములుగా లేదు. రీసెంట్‌గా సమంత రోల్స్ రాయిస్ లో రాణిలా దిగింది. క్వీన్ ఎలిజబెత్ ని తలపించింది. అలా కాస్ట్ లీ కార్ నుంచి స్టైలిష్ గా దిగిన సామ్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఫోటోగ్రాఫర్ల ముందు ఫోజులిచ్చింది. తన కళ్లకు బ్లాక్ కలర్ గాగుల్స్ ధరించి రెబల్ క్వీన్ నే తలపించింది. […]

 Authored By sandeep | The Telugu News | Updated on :10 June 2022,11:00 am

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. చూడ‌చ‌క్క‌ని అందం, ఆకట్టుకునే అభిన‌యం ముద్దుగుమ్మ సొంతం.ఇటీవ‌ల స‌మంత రేంజ్ మాములుగా లేదు. రీసెంట్‌గా సమంత రోల్స్ రాయిస్ లో రాణిలా దిగింది. క్వీన్ ఎలిజబెత్ ని తలపించింది. అలా కాస్ట్ లీ కార్ నుంచి స్టైలిష్ గా దిగిన సామ్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఫోటోగ్రాఫర్ల ముందు ఫోజులిచ్చింది. తన కళ్లకు బ్లాక్ కలర్ గాగుల్స్ ధరించి రెబల్ క్వీన్ నే తలపించింది. ప్రస్తుతం సమంత ముంబై చుట్టూనే తిరుగుతోంది.

అక్కడి పరిశ్రమపై కన్నేసింది. జెట్ స్పీడ్ తో తాను వెళ్లే మార్గంలోనే బిగ్ కెరీర్ ఆశిస్తోంది. బాలీవుడ్‌ బడా దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా చేస్తోన్న కార్యక్రమమే ‘కాఫీ విత్‌ కరణ్‌’. ఇప్పటి వరకు అత్యధికంగా బాలీవుడ్‌ హీరోహీరోయిన్లు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు నుండి బాహుబలి టీం తప్ప మరెవరూ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. అయితే తాజాగా సమంత దీనికి సంబంధించిన షూట్‌లో పాల్గొందని బాలీవుడ్‌ మీడియా కోడైకూస్తోంది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం ఆరు సీజన్లు కాగా, ఏడో సీజన్‌ త్వరలో ప్రారంభం కానున్నట్లు సమాచారం.

samantha sensational comments

samantha sensational comments

Samantha : స‌మంత సంచ‌ల‌న కామెంట్స్  చేయ‌బోతుందా..!

కాగా, ఈ కార్యక్రమం ఓటీటీలో ప్రసారం కానున్నట్లు గతంలో కరణ్‌ వెల్లడించారు. అయితే క‌ర‌ణ్ షోలో పాల్గొన్న స‌మంత త‌న విడాకుల విష‌యంపై నోరు విప్పింద‌నే టాక్ ఒక‌టి న‌డుస్తుంది. ఈ షోలో చాలా కాంట్ర‌వ‌ర్షియ‌ల్ విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే స‌మంత విడాకుల విష‌యం గురించి చ‌ర్చ న‌డించింద‌ని టాక్. ఇటు సమంత సైతం బాలీవుడ్‌లో పాగా వేసేందుకు ఈ ప్రోగ్రామ్‌లో పాల్గన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె నటించిన శాకుంతలం సినిమా షూటింగ్‌ పూర్తి కాగా, యశోద, ఖుషిలో చేస్తున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది