Samantha : ఛీ ఛీ సినిమా బాగోలేదని సమంత ఎంత నీచంగా బిహేవ్ చేస్తుందా..!!
Samantha : బాలీవుడ్ బ్యూటీ సమంత తాజాగా నటించిన ‘ శాకుంతలం ‘ సినిమా ఏప్రిల్ 14 న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై భారీ డిజాస్టర్ గా నిలిచింది. సమంత కెరీయర్ లోనే ఇది పెద్ద డిజాస్టర్ సినిమా అని అంటున్నారు. ఫస్ట్ షో నుండి నెగటివ్ తెచ్చుకున్న శాకుంతలం సినిమా వసూళ్లు అత్యంత దారుణంగా ఉన్నాయి. సమంత గత సినిమా ‘ యశోద ‘ భారీ వసూళ్లను సాధించింది. ఆ సినిమాతో సమంత అంటే ఏంటో నిరూపించుకుంది. అలాంటిది శాకుంతలం సినిమా బ్యాడ్ టాక్ ను తెచ్చుకుంది. మొదటినుంచి శాకుంతలం సినిమాపై జనాలకు హైప్ లేదు.
టీజర్, ట్రైలర్ చూశాక ఈ సినిమా జోలికి పోకుండా ఉండడం బెటర్ అని ప్రేక్షకులు డిసైడ్ అయ్యారు. దీంతో సినిమా విడుదలై డిజాస్టర్ టాక్ ను తెచ్చుకోవడంతో మరింత దారుణ పరిస్థితి ఏర్పడింది. నాసిరకం గ్రాఫిక్స్, సీరియల్ లాంటి స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు గుణశేఖర్. అసలు ఈ ప్రాజెక్టులో దిల్ రాజు ఎలా వేలు పెట్టాడా అని అందరి సందేహం. అయితే శాకుంతలం మూవీ బాగోలేదని చెప్పిన ఓ నెటిజన్ ను సమంత బ్లాక్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆ నెటిజన్ ఈ విషయాన్ని ట్వీట్ చేయగా వైరల్ అవుతుంది. శాకుంతలం సినిమా పెద్ద డిజాస్టర్.
ఇంత చెత్త సినిమా నేను జీవితంలో చూడలేదు. సమంత డబ్బింగ్ దారుణం. ఇకపై డబ్బింగ్ చెప్పకు. నీ ఓవరాక్షన్ ఆపు అంటూ నెటిజన్ ట్వీట్ చేశాడు. అతడి విమర్శలకు ఫైర్ అయిన సమంత అతడిని బ్లాక్ చేసింది. దీంతో ఆ నెటిజన్ సినిమా బాగోలేదు అన్నందుకు నన్ను బ్లాక్ చేస్తావా. సమంత నువ్వు చాలా చీప్ అంటూ మరొక ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నిజానికి ప్రతి ఒక్కరి అభిప్రాయం ఇదే. ఒక పౌరాణిక సినిమాకి వచ్చిరాని తెలుగుతో డబ్బింగ్ చెబితే జీర్ణించుకోవడం కష్టమే అని జనాలు అంటున్నారు.