Samantha : ఎన్నాళ్ల‌కెన్నాళ్లకు స‌మంత పోస్ట్‌లో ప్ర‌త్య‌క్షం అయిన నాగ చైత‌న్య ఫొటో..!

Authored By Sam C | The Telugu News | Updated on: April 5, 2022, 7:03 pm

Samantha: ఒక‌ప్పుడు మోస్ట్ ల‌వ‌బుల్ జంట అంటే స‌మంత‌, నాగ చైతన్య పేరు చెప్పేవాళ్లు. అట్ట‌హాసంగా పెళ్లి చేసుకున్న ఈ జంట అనివార్య కార‌ణాల వ‌ల‌న విడాకులు తీసుకున్నారు. గ‌త ఏడాది అక్టోబ‌ర్ 2న ఈ జంట విడాకులు తీసుకోగా, ఈ నిర్ణ‌యం ప్ర‌తి ఒక్క‌రిని బాధించింది.ఇప్ప‌టి వ‌ర‌కు వారు ఎందుకు విడాకులు తీసుకున్నారో తెలియ‌దు కాని వారి డైవ‌ర్స్ ఇష్యూపై ఎన్నో వార్త‌లు వ‌చ్చాయి. ఎంతో అన్యోన్యంగా ఉండే నాగచైతన్య మరియు సమంత విడాకుల విషయం ఇప్పటికే చాలా మంది అభిమానులు జీర్ణించుకోలేని ఒక చేదు నిజం గా మారిన సంగతి తెలిసిందే.

“ఏ మాయ చేసావే” అనే సినిమాతో మొట్టమొదటిసారిగా కలిసి నటించిన నాగచైతన్య మరియు సమంత తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఆ తర్వాత “ఆటో నగర్ సూర్య”, “మనం” వంటి సినిమాల్లో కూడా కలిసి నటించిన ఈ జంట పెళ్లి తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్లో “మజిలీ” అనే సినిమాతో మరొక హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాలో చైతూ, స‌మంత చాలా రొమాంటిక్‌గా క‌నిపించి ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నారు.

samantha shares naga chaitanya poster

samantha shares naga chaitanya poster

Samantha : ఫుల్ హ్యాపీ

శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మ‌జిలీ చిత్రం మూడేళ్లు పూర్తైన సంద‌ర్భంగా స‌మంత చైతూ సీరియ‌స్ లుక్ పోస్ట‌ర్‌తో పాటు రొమాంటిక్ పోస్ట‌ర్ షేర్ చేసింది. 3 ఏళ్ల మ‌జిలీ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. చాలా రోజుల త‌ర్వాత స‌మంత పోస్ట్‌లో చైతూ పిక్ ప్ర‌త్య‌క్షం కావ‌డంతో అక్కినేని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే విడాకుల అనంతరం కుంగిపోయిన సమంత.. చైతూతో గడిపిన జ్ఞాపకాలను చెరిపివేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్పటికే తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి నాగ చైతన్య ఫోటోలను డిలీట్‌ చేసిన సామ్‌ రీసెంట్‌గా అతన్ని అన్‌ఫాలో కూడా చేసేసింది. అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున,రానా, వెంకటేష్‌ కుమార్తె ఆశ్రితలను ఇంకా ఫాలో అవుతున్న సామ్‌ చైతన్యను మాత్రమే అన్‌ఫాలో చేసింది.

samantha shares naga chaitanya poster

samantha shares naga chaitanya poster

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp