Samantha : నాగ చైతన్య విషయంలో ఇన్నాళ్ల తరవాత తన తల్లితో ‘ ఆ మ్యాటర్ ‘ చెప్పేసిన సమంత ?

Authored By Rame Samhith | The Telugu News | Published on: October 7, 2022, 2:30 pm

Samantha : ఏమాయ చేసావె సినిమాలో కలిసి నటించి ఆ సినిమా టైం లోనే ప్రేమలో పడిన సమంత, చైతు ఇద్దరు స్నేహితులుగా మారి ప్రేమలో పడ్డారు. ఇద్దరి ప్రేమకి పెద్ద వాళ్లు కూడా ఓకే చెప్పడంతో 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే మూడేళ్లకే వీరి మధ్య ఏవో తేడాలొచ్చి ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇద్దరి మధ్య దూరం పెరిగిందని వార్తలు వచ్చినా సైలెంట్ గా ఉండి ఫైనల్ గా ఇద్దరం డైవర్స్ తీసుకుంటున్నాం అని షాక్ ఇచ్చారు. అసలు అంతగా ప్రేమించుకున్న వీరిద్దరు విడిపోవడం ఏంటని అందరు షాక్ అయ్యారు.

కలిసి ఉన్న కొంతకాలం జోడీ అంటే వీరిదే అనేలా అనిపించిన నాగ చైతన్య, సమంత విడిపోవడాన్ని ఫ్యాన్స్ కూడా డైజెస్ట్ చేసుకోలేదు. అయితే నాగ చైతన్య విషయంలో సమంత ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అన్నది నాగ చైతన్య తల్లి లక్ష్మితో పంచుకుందట. ఇంతకీ సమంత ఎందుకు ఆ డెశిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఆమె ఎందుకు చైతుని దూరం చేసింది అన్నది తన అత్తతో పంచుకుందట. అయితే సమంత చెప్పిన విషయాలు ఆమెకి కూడా షాకింగ్ గా అనిపించాయని తెలుస్తుంది. చైతు పెళ్లికి ముందు ఉన్నంత ప్రేమగా పెళ్లి తర్వాత ఉండట్లేదని. తన స్వేచ్చకి కూడా అడ్డు వస్తున్నాడని. భర్త అంటే గౌరవం ఉన్నా తన మాటే వినాలని చెప్పడం కరెక్ట్ కాదని సమంత తన వాదన వినిపించిందట.

samantha shares secret to naga chaitanyas mother

samantha shares secret to naga chaitanyas mother

అయినా సరే ఇన్ని జరిగినా చైతు తనని అర్ధం చేసుకుని ఉంటా అంటేనే కలిసి ఉంటానని.. లేకపోతే విడిపోతానని అన్నదట. చైతు మాత్రం తనని కంట్రోల్ చేయడాన్ని సహించలేని సమంత దీనికన్నా ఒంటరిగా ఉండటం బెటర్ అని భావించింది. అందుకే ఆమె అక్కినేని ఫ్యామిలీ నుంచి దూరం అయ్యింది. అయితే డైవర్స్ తర్వాత సమంత వరుస సినిమాలతో సత్తా చాటుతుంది. శాకుంతలం, యశోద రెండు సినిమాలు చేస్తుంది. విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా కూడా చేస్తుంది సమంత. ఈ 3 సినిమాలతో సమంత చెలరేగిపోతుంది. ఇదే కాదు బాలీవుడ్ లో కూడా సమంత వరుస సినిమాలు, వెబ్ సీరీస్ లతో దూసుకెళ్తుంది.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp