Samantha : త్వరలోనే సంతోషం రాబోతోంది!.. సమంత ఉద్దేశ్యం అదేనా?

Authored By Cinema Desk | The Telugu News | Published on: November 6, 2021, 8:15 am

Samantha  : సమంత ప్రస్తుతం కొటేషన్లతోనే తన భావాలను తెలుపుతోంది. ఎవరో ఎక్కడో రాసిన కొటేషన్లు, లేదా అమ్మ చెప్పందంటూ సమంత కొన్ని కొటేషన్లను, సూక్తులను షేర్ చేస్తోంది. అంటే సమంత ఉద్దేశ్యం కూడా అదేనని తెలుస్తోంది. తన భావం కూడా అదేనంటూ చెప్పకనే చెప్పేస్తోంది సమంత. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత తీరే మారిపోయింది. కొటేషన్ల మీద కొటేషన్లు చెబుతోంది. ప్రేమ, విరహం, వేధన, జీవితసారం ఇలా ఎన్నో విషయాల మీద సమంత స్పందిస్తోంది.

Samantha Shares Zomato Quotation

Samantha Shares Zomato Quotation

తాజాగా జొమాటో షేర్ చేసిన కొటేషన్‌ను సమంత తన ఇన్ స్టా స్టోరీలో పెట్టుకుంది. అదే పోస్ట్‌ను సమంత కూడా షేర్ చేసింది. ఇంతకీ అందులో ఏముందంటే.. ఈ ఏడాది దీపాలు వెలిగించని ఇళ్లు.. స్వీట్లు కూడా వాటి రుచిని పోయినట్టుగా అనిపించడం, ఏడాది ప్రారంభంలోనే ఎంతో మందికి ఎన్నో రకాల నష్టాలు కలిగాయి.. అలాంటి వారందరికీ కూడా ఈ పండుగలన్నీ కూడా చిన్నవిగా కనిపిస్తున్నాయి.

Samantha  : సమంత ఎమోషనల్ కొటేషన్స్..

samantha in dubai

samantha in dubai

అలాంటి వారందరికీ కూడా త్వరలోనే సంతోషాలు కలగాలి.. అందరూ తమ తమ సంతోషాలను వెతుక్కుంటారని కోరుకుంటున్నామని జొమాటో చెప్పింది. సమంత కూడా అదే చెప్పేసింది. మొత్తానికి సమంత కూడా అందరికీ సుఖ సంతోషాలు కలగాలని కోరింది. ఈ ఏడాదిలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా నష్టాలు వాటిల్లాయి. అయితే సమంత విడాకుల వ్యవహారంతో ఈ ఏడాది ఆమెకు చేదు అనుభవంగా మిగిలిపోనుంది. మొత్తానికి సమంత ఇప్పుడు విడాకుల వ్యవహారాన్ని పక్కన పెట్టేసింది. తన సాధారణ జీవితంలో నిమగ్నమైంది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp